శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు… రమణదీక్షితులు.. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తితో కలిసి ప్రెస్‌మీట్ పెట్టడం టీటీడీ వర్గాల్లోనే కాదు.. శ్రీవారి భక్తుల్లోనూ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తమయింది. లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్‌ను కలిసినా కొంత మంది రమణదీక్షితులను సమర్థించారు… కానీ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి విషయంలో ఎవరూ ఆయనను వెనకేసుకొచ్చేందుకు సిద్ధపడటం లేదు. కారణం.. బోరుగడ్డ అనిల్ బ్యాక్‌గ్రౌండ్. ఏకంగా హోంమంత్రి పేరు చెప్పుకుని భూసెటిల్మెంట్లు చేసినట్లు అనిల్‌పై కేసులున్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ స్టేషన్లో అనిల్‌పై రౌడీ షీట్ కూడా ఉంది.
జగన్ బావమరిదిని అని చెప్పుకుంటూ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తానంటూ వసూళ్లకు పాల్పడినట్టు కూడా ఇతనిపై ఫిర్యాదులున్నాయి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు యూత్ అధ్యక్షుడిగా చెప్పుకుంటూ… ఐఏఎస్, ఐపీఎస్‌ల వద్ద వసూళ్లు చేశారు. ఇవే కాదు.. బోరుగడ్డ అనిల్ సైమన్ అమృత్ ఫౌండేషన్ అనే క్రిస్టియన్ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు. గుంటూరు వల్లూరివారి తోటలో.. భీంసేన పేరుతో ఓ కార్యాలయం ప్రారంభించారు. ఇంత నేర చరిత్ర, అన్యమత ప్రచారం చేసే వ్యక్తితో రమణదీక్షితులకు ఎక్కడ పరిచయం అయింది..? ఎలా ఇద్దరూ కలిసి ప్రెస్‌మీట్ పెట్టే స్థాయికి వచ్చారు..? అసలు తెర వెనుక ఏం జరుగుతోందన్న చర్చ ఇప్పుడు విస్త్రతంగా జరుగుతోంది.
రమణదీక్షితులును రాజకీయంగా అడ్డుపెట్టుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే… బోరుగడ్డ అనిల్‌ను రమణదీక్షితుల దగ్గరకు చేర్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బోరుగడ్డ అనిల్… వైఎస్ వివేకానందరెడ్డికి.. కొంచెం దూరపు చుట్టం. ఓ రకంగా మేనల్లుడవుతారు. బ్రదర్ అనిల్‌తోనూ సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రమణదీక్షితులు లోటస్‌పాండ్‌కు వెళ్లి… చర్చలు జరిపినప్పుడు … రమణదీక్షితులకు సాయం చేయడానికి… వైసీపీ తరుపున ఈ బోరుగడ్డ అనిల్‌కు బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి వైసీపీ నుంచి వచ్చే సూచనలు, సలహాల ప్రకారం..రమణదీక్షితుల రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేయాలి.. తర్వాతి కార్యాచరణ ఏమిటన్నది.. ఈ అనిల్ పర్యవేక్షిస్తున్నట్లు… వైసీపీ వర్గాలు ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నాయి.
తాను రాజకీయ పావుగా మారడానికి అంగీకరించిన రమణదీక్షితులు.. కనీసం చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోకుండా.. అందరి ముందూ చులకనైపోతున్నారు. కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకునిగా ఇరవై నాలుగేళ్ల పాటు వ్యవహరించి ఇప్పుడు అన్యమతస్తులతో కలిసి రాజకీయాలు చేయడమేమిటన్న విమర్శలు తీవ్రంగానే వస్తున్నాయి. బోరుగడ్డ అనిల్ .. క్రిస్టియన్ మత ప్రచార సంస్థలు నడుపుతాడని.. రమణదీక్షితులకు తెలియకుండా ఉంచి ఉన్నట్లయితే…. కావాలని ఆయను వైసీపీ ట్రాప్‌లోకి లాగినట్లే. ఒక వేళ తెలిసి కూడా రమణదీక్షితులు… చేతులు కలిపి ఉంటే.. శ్రీవారికి ద్రోహం చేసినట్లే..!