వైసీపీ రాజకీయం భిన్నంగా ఉంటుంది. విపక్ష పార్టీల అగ్రనేతలపై వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడ్డారు. బూతులు తిడతారు.. కుటుంబాల్ని కించ పరుస్తారు. అలాంటి వాటికే జగన్ రెడ్డి మెప్పు ఉంటుంది కాబట్టి పార్టీ నేతలుకూడా అదే పని చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబాన్ని, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఆయన కుటుంబాన్ని కూడా దూషించేవారు. ఇప్పుడు అలాంటి వారిలో చాలా మందికి షాక్ తగులుతోంది. కానీ వారు నోరెత్తలేకపోతున్నారు.
ఇలాంటి నేతలకు ఇప్పుడు వేరే ఆప్షన్ లేకుండా పోయిందన్న అభిప్రాయం ఉంది. తమకు వైసీపీలో టిక్కెట్ ఇవ్వలేదని మీ పార్టీలో ఇవ్వాలని వారు టీడీపీ, జనసేనలను అడగలేరు.. అడిగినా వారిని తీసుకుని టిక్కెట్ ఇచ్చేంత విశాలమైన మనస్థత్వం టీడీపీ, జనసేన నేతలకు ఉండకపోవచ్చు. ఓ రకంగా తాము టిక్కెట్లు ఇవ్వకపోయినా తమ నేతలు ఇతర పార్టీల్లో చేరకుండా ముందు నుంచి వైసీపీ హైకమాండ్ ఇలాంటి వ్యూహం అమలు చేసిందన్న సందేహం కూడా ఇప్పుడు చాలా మంది వైసీపీ నేతలకు వస్తోంది. అందులో నిజం ఉన్నా లేకపోయినా ఈ కారణంగా తమకు ప్రాధాన్యం దక్కపోయినా తప్పనిసరిగా వైసీపీలోనే ఉండాల్సిన పరిస్థితుల్లో కొంత మంది నేతలు ఉన్నారు. వారు జగన్పై , పార్టీపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించాల్సిందే. కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేసినా రెండు పార్టీలకు కాకుండా పోతారు.
అదే సమయంలో వైసీపీ అధినాయకత్వం .. టిక్కెట్లు నిరాకరిస్తున్న వారినిపై.. ఓడిపోతున్నారనే మారుస్తున్నామన్న ముద్ర వేస్తోంది. ఇది ఆ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారుతోంది. తాము ప్రజలకు అందుబాటులో లేమని అవినతికి పాల్పడినందువల్ల ప్రజాభిమానం కోల్పోయామన్న భావన ప్రజల్లో ఏర్పడుతున్నా వారేమీ చేయలేకోపతున్నారు. కొంత మంది ఆరోగ్య కారణాలతో పోటీ నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటిస్తున్నారు.