సభకు రండి అంతు చూస్తామంటూ గతంలో ఎన్నో సార్లు టీడీపీ ఎమమెల్యేలను హెచ్చరించిన నేతలు ఇప్పుడు నిజంగానే దాడికి పాల్పడ్డారు. జీవో నెంబర్ వన్ రద్దు చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేస్తూంటే ఉద్దేశపూర్వకంగా వారిపై దాడికి పాల్పడ్డారు వైసీపీ ఎమ్మెల్యేలు. పక్కా ప్లాన్ ప్రకారం ఎవరు ఎవరిపై దాడిచేయాలో ముందుగా నిర్ణయించుకున్నట్లుగా టీడీపీ దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు దాడి చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వెల్లంపల్లి శ్రీనివాస్ దాడి చేశారు.
సుధాకర్ బాబు దాడి చేయడంతో ఒక్క సారిగా అసెంబ్లీలో లైవ్ ఆపేశారు. దృశ్యాలు కనిపించకుండా చేశారు. సుధారర్ బాబును అడ్డుకునేందుకు టీడీపీ నేతుల ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది . దీంతో సభను స్పీకర్ హడావుడిగా వాయిదా వేశారు. తర్వాత టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ీ అంశంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. స్పీకర్ సమక్షంలోనే తమ పై దాడి జరిగిందని… మొత్తం వీడియోను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు.
దాడులు అనేది వైసీపీ కి ఓ కామన్ ఫ్యాక్టర్ గా మారిపోయింది. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై దాడి చేయడం వైసీపీలో కింది స్థాయి నుంచి ఉంది. ప్రభుత్వ పెద్దలు కూడా అదే రీతిన ఉండటంతో చెలరేగిపోతున్నారు. చట్టసభల్లో ఎమ్మెల్యేలపై కూడా దాడి చేసే పరిస్థితి వచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అంతా అంతా చేసిన తర్వాత వైసీపీ నేతలు టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పై దాడికి ప్రయత్నించారంటూ ఆరోపణలు చేస్తున్నారు. వీడియోలు విడుదల చేస్తే అసలు విషయమేమిటో తెలిసిపోతుంది కదా అంటే మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు.