వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాత్రికి రాత్రే చేరిన వారికి టిక్కెట్లు వచ్చాయి. టీడీపీ నుంచి ఎంత బలమైన నేతలు వస్తే అంత మందిని చేర్చుకున్నారు. గంటా, పితాని లాంటి వాళ్లతో ఆడిన మైండ్ గేమ్ బయటకు వచ్చారు. వారికి సర్వే రిపోర్టులు పంపి.. గెలవబోతున్నామని భయపెట్టి… పార్టీలోకి రావాలని.. కంగారు పెట్టేశారు. కానీ వారు.. తెలివిగా ఆలోచించారు. వెళ్లలేదు. కానీ.. చాలా మంది వెళ్లారు. వారందరూ.. వైసీపీ సర్వేలను నమ్మేశారు. తీరా.. ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వారికి పరిస్థితి అర్థమవుతోందట.
వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. సంస్థ ఐప్యాక్. ఆ సంస్థ మ్యాన్ పవర్ ఎంత ఉందో కానీ.. పై స్థాయిలో… మీడియా మేనేజ్ మెంట్ బాగా చేసుకుంటుంది. అందుకే.. ఏపీలో సర్వేల పేరుతో.. రకరకాల సంస్థల పేరుతో.. నివేదికలు జాతీయ మీడియాకు అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో.. ఆ సర్వేలను… వైసీపీలోకి నేతలను లాగడానికి కూడా ఉపయోగించుకున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని 125 అసెంబ్లీ సీట్లు, 17 లోక్ సభ సీట్లు వస్తాయని విస్తృతంగా ఓ మూడు సంస్థల పేరుతో సర్వే నివేదికలు సిద్ధం చేశారు. ముఖ్యనేతలందరికీ పంపించారు. తటస్థంగా ఉన్న వారందరికీ ఈ సర్వే నివేదికలు చూపించి తమ వద్దకు వస్తే కండువా వేయడం ప్రాంరభించారు. ఇలా అనేక మందిని ఆకర్షించారు. ఆకర్షణీయమైన సర్వే నివేదికలను చూపించి పోటీకి కూడా ఒప్పించారు. చివరకు నియోజకవర్గాలకు వచ్చి తమ సొంత మార్గాల ద్వారా సర్వే చేయించుకున్న నేతలకు మైండ్ బ్లాంక్ అయినంత పని పోతోందట.
ఏపీలో ఓ కీలక నియోజకవర్గానికి… ఎంపీ అభ్యర్థిగా పారిశ్రామికవేత్తను ఎంపిక చేసుకున్నారు. ఆయనకు ఈ సర్వే రిపోర్టులే పంపారు. దాంతో ఆయన పోటీకి అంగీకరించి కండువా కప్పుకున్నారు. తీరా సొంత మార్గం ద్వారా సర్వే చేయించుకుంటే.. అసలు విషయం తేడాగా ఉందని క్లారిటీ వచ్చేసిందంటున్నారు. అందుకే ఇప్పుడు పోటీ నుంచి వైదొలగాలా.. అని ఆలోచిస్తున్నారంటున్నారు. ఒకే వేళ పోటీలో ఉన్నా.. డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదనుకుంటున్నారు. ఈ సర్వే నివేదికలతో… ముఖ్యంగా క్యాష్ పార్టీలను.. వైసీపీ నేతలు ఆకర్షించగలిగారన్న ప్రచారం జరుగుతోంది.