రాష్ట్రంలో 90 శాతానికిపైగా మండలాధ్యక్ష పదవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ గెల్చుకుంది. అక్కడక్కడా విపక్ష పార్టీలు గెల్చుకున్నాయి. అయితే అలాంటి చోట్ల కూడా వైసీపీ నేతలకు తమకే పదవులు కావాలంటున్నారు. దాని కోసం అధికారాన్ని దుర్వినియోగం కూడా చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంపీపీని గెల్చుకుని తీరాలని పట్టుదలకుపోయారు. అక్కడ వైసీపీకి మెజార్టీ లేదు. అయితే టీడీపీ తరపున ఒకే ఒక్క బీసీ అభ్యర్థి ఉన్నారు.
వారికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇప్పించకపోతే పదవి దక్కదు కాబట్టి తప్పని సరిగా వైసీపీకే మండలాధ్యక్ష పదవి వస్తుందని ప్లాన్ చేశారు. ఇప్పుడు టీడీపీ అభ్యర్థికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. కానీ ఆమె కోర్టుకు వెళ్లింది దుగ్గిరాల మండల అధ్యక్ష ఎన్నికపై హైకోర్టు స్టే ఇచ్చింది. జబీన్ కుల ధ్రవీకరణ పత్రంపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దుగ్గిరాల ఎంపీపీ స్థానం బీసీలకు రిజర్వ్ అయింది.
తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వారిలో బీసీ వర్గానికి చెందిన ఎంపీటీసీ ఒక్కరే ఉన్నారు. అయితే షేక్ జబీన్ అనే ఆ ఎంపీటీసీకి క్యాస్ట్ సర్టిఫికెట్‌ను అధికారులు మంజూరు చేయడం లేదు. ఓ సారి ఎమ్మార్వో తిరస్కరించారు. క్యాస్ట్ సర్టిఫికెట్ జారీ చేయకుండా కుట్ర చేసి దుగ్గిరాల ఎపీపీ స్థానాన్ని వైసీపీ గెల్చుకోవాలనుకుంటోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లోకేష్ పని చేసుకుంటున్న నియోజకవర్గం కావడంతో వైసీపీ నేతలు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.