సీనియర్ నేత పెద్దిరెడ్డిని జగన్ రెడ్డి హ్యూమలేట్ చేశారు. ఆయన స్థాయికి అతి చిన్న పదవి అయిన పీఏసీ సభ్యుడి పదవికి పోటీ చేయమని చెప్పి ఆయన పత్తా లేకుండా పోయారు. కనీసం ఓటింగ్ కు కూడా రాలేదు. ఆయన రాలేదని మిగతా ఎమ్మెల్యేలు కూడా రాలేదు. పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే పదో వంతు సభ్యుల మద్దతు ఉండాలి. అంత బలం వైసీపీకి లేకనే జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు.
పీఏసీ సభ్యుడికి ఆ బలం వచ్చే అవకాశం లేదు. అయినా జగన్ పెద్దిరెడ్డిని పోటీ చేయమన్నారు. కానీ ఓటింగ్ ప్రారంభం కాక ముందే తాము బాయ్ కాట్ చేస్తున్నట్లుగా వైసీపీ ప్రకటించింది. దీనికి కారణం ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్ కు రాకపోవడమే. స్వయంగా పార్టీ అధినేత జగన్ ఓటింగ్ కు రాకుండా అంసెబ్లీ ప్రారంభమయ్యే సమయానికి బెంగళూరు వెళ్లిపోయారు. దీంతో మరికొంత మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.
తమ పార్టీకి ఉన్న ఓట్లు కూడా పెద్దిరెడ్డికి రాకపోతే పరువు పోతుందన్న ఉద్దేశంతో బాయ్ కాట్ చేయడమే మంచిదని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఏ మాత్రం ఆలోచన లేని రాజకీయం చేయడం వల్ల పెద్దిరెడ్డి వంటి నేతకు ఘోర అవమానం జరిగిందని వైసీపీ వర్గాలంటున్నాయి.. ఇలాంటి పరిస్థితిని పెద్దరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో కూడా ఎదుర్కోని ఉండరని అంటున్నారు.