కాలం కలసి వస్తే కింగులం అయిపోదామని ఏ జాతీయ కూటమిలోనూ చేరకుండా టెక్కు చూపిన బీఆర్ఎస్, వైసీపీలకు ఇప్పుడు తమకో అండ ఉండాలని జాతీయ స్థాయిలో ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటున్నారు. అని వార్యంగా బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరవుతోంది. అంతే అనివార్యంగా కాంగ్రెస్ కు జగన్ దగ్గరవుతున్నారు. కానీ కాలం కలసి వచ్చినప్పుడు వారి అనివార్యతల్ని పక్కన పెట్టి కలిపి రాజకీయాలు చేసేందుకు మాత్రం ఓ దారి ఉంచుకునే అవకాశం ఉంది.
బీజేపీ నుంచి తన పార్టీకి పొంచి ఉన్న పెను ముప్పు నుంచి తప్పించుకునేందుకు, కవితను జైలు నుంచి బయటకు తెచ్చేందుకు బీఆర్ఎస్ కు మరో మార్గం కనిపించడం లేదు. అందుకే బీజేపీతో విలీన ఫార్ములాపై చర్చించి వచ్చారు. ఇంప్లిమెంట్ చేయడమే మిగిలింది. అందులో భాగంగానే బీజేపీపై విమర్శలు చేయడం లేదు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఏమీ రాలేదని రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు కానీ బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. అసెంబ్లీలోనూ అదే వరుస. బీఆర్ గడ్డు పరిస్థితి అందరికీ అర్థమైపోయింది.
Read Also : వైసీపీ ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు ఉన్నట్టా..? లేనట్టా..?
వైసీపీ కూడా అంతే. షర్మిల రూపంలో ఏపీ కాంగ్రెస్ తన పార్టీని కబళించడం ఖాయమని స్పష్టత రాగానే బీజేపీతో వచ్చే ముప్పును సానుభూతి రూపంలో మల్చుకోవచ్చని… కాంగ్రెస్ కూటమి వైపు వెళ్లిపోతున్నారు. బీజేపీకి ఆయన మరోసారి దగ్గరయ్యే అవకాశాలు లేవు. అంటే బీఆర్ఎస్ బీజేపీ వైపు… జగన్ కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. ఇద్దరు మిత్రుల ఈ భిన్న రాజకీయం ఆసక్తికరమే.
ఇద్దరికీ వచ్చే పార్లమెంట్ సీట్లతో జాతీయ రాజకీయాలను దున్నేయాలన్నది కేసీఆర్, జగన్ ప్లాన్ . కానీ చివరికి రెండు పార్టీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు వారికి అనువైన మార్గాల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. భ విష్యత్ లో కాలం కలసి వస్తే.. మళ్లీ కలిసేంత స్నేహం మాత్రం కొనసాగించనున్నారు. అది కూడా వారికి తప్పని అనివార్యత.