రాజకీయానికి పండగా… జబ్బలు ఉండవు. ప్రత్యర్థులపై బురద చల్లేందుకు వచ్చే ఏ అవకాశాన్నీ వదిలి పెట్టుకోరు. అది పండగ అయినా సరే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అదే జరుగుతోంది. ఏ అవకాశం దొరికితే దానిపై పార్టీల నేతలపై విరుచుకుపడేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. బీఆర్ఎస్ పార్టీలో అసహనం పెరుగుతోంది., మాటల దాడి నుంచి చేతల దాడికి వెళ్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో వ్యవహరించిన విధానం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రాజకీయాలు ఇలా కూడా మారుతాయా అనుకున్నారు . రాజకీయ వివాదాలు.. వ్యక్తిగత శత్రుత్వాలుగా మార్చుకోవడం అంటే ఇదే.
ఏపీలోని రాజకీయాలు ఏమీ మారడం లేదు. ఆరు శవాలు దొరికిన తర్వాత కూడా తాము ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేకపోయామన్న భావనతో వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. గతంలోలా పరిస్థితి లేదు. జగన్ రెడ్డి పదేళ్ల పాలనను ప్రజలు మర్చిపోరు. ఆ దుర్బర పాలన కాళ్ల ముందు ఉండగానే నీతులు చెబుతూ వైసీపీ నేతలు వస్తున్నారు. వారి హయాంలో పట్టపగలు హత్యాయత్నాలు చేస్తేనే దిక్కు లేదు.. ఎవర్నీ అరెస్టు చేసేవారు కాదు. ఇక పాలనా పరమైన విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై తీసుకున్న చర్యలే లేవు. అయినా ఇప్పుడు మాత్రం తగుదునమ్మా అంటూ శవరాజకీయాలతో వచ్చేస్తున్నారు.
రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాడు. తప్పుడు ప్రచారాలు.. ఫేక్ న్యూస్‌తో ఇప్పుడు రాజకీయాలు చేద్దామంటే సాధ్యం కావడం లేదు. ప్రజలు కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. ఉచితాలతో తమ డబ్బు దోచేసి తమకే ఇవ్వాలని కోరుకోవడం లేదు. అలాగే భావోద్వేగాల రాజకీయాలపైనా ఆసక్తీ చూపించడం లేదు. రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని విశ్లేషిచంుకుని పాత రాజకీయాల్ని బోగి మంటల్లో వేసి.. ప్రజా సమస్యలే కేంద్రంగా రాజకీయాలు ప్రారంభిస్తే ఫలితాలు ఉండవచ్చు.