భాజాపా, తెదేపా ల మధ్య రగులుతున్న పోలవరం మంటల్లో తన వంతు కాక రేపే పనికి విపక్ష వైసీపీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఈ విషయంలో చంద్రబాబు ను దుమ్మెత్తి పోస్తున్న ఆ పార్టీ నేతలు… మరో వైపు బస్సు యాత్రకు జెండా వూపనున్నారు.
పోలవరం పనుల పరిశీలనకు ఈ నెల 7న బస్సు యాత్ర చేపడుతున్నట్టు వైసీపీ ఆదివారం ప్రకటించింది. ఉదయం 9గంటలకు ఈ యాత్ర ప్రారంభమవుతుంది అని పార్టీ శ్రేణులు చెప్పాయి. ఈ యాత్ర లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సి లు అందరూ పాల్గొంటారని చెబుతున్నారు.
ఇదిలా ఉంటె మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడిన మాజీ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరున్ కుమార్ ఈ విషయం లో వైసీపీ పోరాట స్థాయిని ప్రశ్నార్థకం చేసేసారు. తన ఎమ్మెల్యేలు జారిపోతుంటేనే కాపాడుకోలేక పోతున్న వైసీపీ… ఇక పోలవరం ఏం పోరాటం చేస్తుంది? అంటూ ఎద్దేవా చేశారాయన