సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏ సందర్భం వచ్చినా.. అంటే ఆయన పుట్టిన రోజు కావొచ్చు.. పండగ కావొచ్చు .. ఏదైనా సరే పెద్ద ఎత్తున ప్రతీ ఊరిలో ఫ్లెక్సీలు కనిపించేవి. క్యాడర్ అంత హుషారుగా ఉండేవారు. కానీ ఇటీవలి కాలంలో అవి పూర్తిగా తగ్గిపోయాయి. ఆదాయం వచ్చే పదవులు పొందిన కొంత మంది మాత్రమే కొన్ని చోట్ల ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఆదాయాన్ని కోల్పోయిన పదవులు పొందిన వారు..సాధారణ క్యాడర్ మాత్రం ఎలాంటి ఫ్లెక్సీలు పెట్టడం లేదు. తాడేపల్లికి వెళ్లే దారిలో గతంలో పుట్టిన రోజు అంటే దారిపొడవునా ఫ్లెక్సీలు కనిపించేవి. కానీ అది ఒక్క ఏడాదికే. ఇప్పుడు ఎవరో ఒకరు తప్ప.. పెద్దగా పెట్టడం లేదు. దీనికి కారణం క్యాడర్ ఆర్థికంగా చితికిపోవడమే.
ఉపాధి బిల్లులు, పంచాయతీల బిల్లులు అన్నీ స్వాహా !
టీడీపీ హయాంలో చేసిన ఉపాధి పనుల బిల్లులు చెల్లించకుండా ఆ పార్టీ నేతల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. వారు ప్రతిపక్షం కాబట్టి పోరాడారు. కోర్టుకెళ్లారు. వీలయినంత వరకూ ఇప్పించుకోగలిగారు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలకే ఆ పరిస్థితి ఎదురవుతోంది. చేసిన పనులకు బిల్లులు రావడం లేదు. పంచాయతీ ఖాతాల్లో నిధులు ఉండటం లేదు. దీంతో వైసీపీ క్యాడర్ తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపోయింది. కొంత మంది ోడ్డెక్కుతున్నాు. కోర్టులకెళ్తున్నారు. ఆర్థికంగా బాగుండటం కోసమే పార్టీ అని… అదే లేనప్పుడు పార్టీ ఏమిటనేది వారి భావన.
బిల్లుల కోసం హైకోర్టులో వందల పిటిషన్లు !
హైకోర్టులో ఆరేడు వందల పిటిషన్లు కేవలం బిల్లుల చెల్లింపు కోసమే పడుతున్నాయి. పనులు చేశామని ప్రభుత్వం ఇవ్వడం లేదని.. ఆ పిటిషన్ల సారాంశం. వీరంతా ఎవరు ? గత ప్రభుత్వంలో పనులు చేసిన వాళ్లు కాదు. ఈ ప్రభుత్వంలో చేసిన వాళ్లే. అందరూ వైసీపీ కార్యకర్తలు.. సానుభూతి పరులే. చివరికి కోవిడ్ సమయంలో పేషంట్లకు అన్నం పెట్టిన బిల్లులూ ఇవ్వడం లేదు. ఆ కాంట్రాక్టులూ వైసీపీ నేతలే చేశారు. మన ప్రభుత్వం.. మన నేత ఏమనుకుంటాడో అన్న మ౧హమాటంతో చాలా మంది కోర్టుకు వెళ్లడం లేదు. అధికారుల చుట్టూనే తిరుగుతున్నారు.
రోడ్డెక్కి నిరసన చేస్తున్న వైసీపీ సర్పంచ్‌లు !
ఇప్పుడు సర్పంచ్ల పరిస్థితీ అంతే. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఎన్నికైనప్పటి నుండి అసలు నిధులే ఉండటం లేదు. గెలిచిన వారిలో అత్యధికులు తమ స్తోమతను బట్టి ఎడాపెడా ఖర్చు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇంకొందరు అప్పులపాలయ్యారు. చివరికి గ్రామాల్లో పనులు చేయించడానికి కూడా నిధులు ఉండటం లేదు. వీరిలో 80 శాతం మంది వైసీపీ నేతలే. ఇలా ద్వితీయ శ్రేణి క్యాడర్‌కు ఏ మాత్రం లాభం లేకుండా అప్పుల పాలు చేస్తే వారు రేపు ఎన్నికల్లో పార్టీని గెలిపించాలన్న కసితో పని చేయడం కష్టమేననన్న వాదన వినిపిస్తోంది. వైసీపీ గెలుపు సంగతి తరవాత ముందు క్యాడర్‌నూ దివాలా తీయించి జగన్ ఏం సాధిస్తారని.. వారి నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.