వైసీపీ క్యాడర్ ఆత్మహత్యలకు పాల్పడుతోంది. బెట్టింగుల్లో తీవ్రంగా నష్టపోవడమే దీనికి కారణం. ఫలితాలు వచ్చినప్పటి నుండి పది మందికిపైకా వైసీపీ కార్యకర్తలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. భారీ స్థాయిలో బెట్టింగులు కాసి నష్టపోవడమే దీనికి కారణం. గుడివాడ , దెందులూరు వంటి చోట్ల ఇలాంటి మరణాలకు టీడీపీ నేతల వేధింపులని కలరింగ్ వేసి.. విషయం బయటకు రాకుండా వైసీపీ నేతలు వెళ్లి ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి వస్తున్నారు.
వైసీపీ పరాజయం ఖాయమని తెలిసినా…. ఆ పార్టీ నేతలు ఓ గుడ్డి నమ్మకాన్ని ప్రచారం చేశారు. పెయిడ్ సర్వేలతో క్యాడర్ ను నమ్మించారు. చివరికి ఆరా మస్తాన్ కు కోట్లు ఇచ్చి తప్పుడు సర్వే వేయించారు. ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లి జగన్ కూడా అవే మాటలు మాట్లాడటంతో.. వైసీపీ క్యాడర్ నమ్మకంతో బెట్టింగులు కాసింది. టీడీపీ నేతలు అదే పనిగా రెచ్చగొట్టడంతో.. జగన్ నమ్మకం ఇచ్చారు కదా అని ఇల్లూ వాకిలి తాకట్టు పెట్టారు. సర్వం పొగొట్టుకున్నారు.
ఇలాంటి బెట్టింగులకు పాల్పడిన వివాదాలు కూడా పెరుగుతున్నాయి. దాడులకు కారణం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో వైసీపీ పెద్దలు సైలెంట్ గా ఉంటున్నారు. ఆ వివాదాలన్ని టీడీపీ దాడులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి తాను ఓడిపోవడం కాకుండా పార్టీ క్యాడర్ ను కూడా దివాలా తీయించారు జగన్.