తప్పుడు సర్వే ఇవ్వడానికి ఆరా మస్తాన్ కు ఎన్ని నిధులు అందాయో కానీ… ఆయన వల్ల వైసీపీ క్యాడర్ దివాలా తీసింది. ఎన్నికల ఖర్చుల కన్నా ఎక్కువగా బెట్టింగుల ద్వారా సర్వం కోల్పోయామని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. దీనంతటికి కారణం ఆరా మస్తాన్ అని బహిరంగంగానే నిందిస్తున్నారు. కొట్టు సత్యనారాయణ, నల్లగట్ల స్వామిదాస్ వంటి వారు బయట పడ్డారు. ఎక్కువ మంది కుమిలిపోతున్నారు.
ప్రజా వ్యతిరేకత సంగతి పక్కన పెడితే జగన్ రెడ్డి ఎలాగైనా గెలుస్తారన్న ఓ ప్రచారాన్ని, నమ్మకాన్ని క్యాడర్ లోకి ముందుగానే ఎక్కించారు. తర్వాత జాతీయ మీడియా సంస్థల సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తో ఆ మత్తును దింపే ప్రయత్నం జరిగింది కానీ.. చివరికి ఆరా మస్తాన్ అనే వ్యక్తి మొత్తానికి ముంచేశాడు. బెట్టింగులకు ఆరా మస్తాన్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ను నమ్మడంతో మొదటికే మోసం వచ్చింది.
మొత్తంగా వైసీపీ క్యాడర్ దాదాపుగా వెయ్యి కోట్లు నష్టపోయిందని అంటున్నారు. పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీరంతా ఇళ్లు,ఒళ్లు బెట్టింగుల్లో పెట్టిన వారే. పరిస్థితి తేడాగా ఉందని తెలిసినా… ఏ మాత్రం పట్టించుకోకుండా… గెలుస్తున్నామని నమ్మకం కల్పించి.. బెట్టింగులకు పాల్పడేలా చేశారు. కనీసం పోలింగ్ ముగిసిన తర్వాత అయినా … ఈ ప్రచారం మానుకుని ఉంటే.. వైసీపీ క్యాడర్ ఆర్థికంగా చితికిపోకుండా ఉండేది.