వైఎస్ జగన్మోహన్ రెడ్డి 30వ తేదీ అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీని కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నగర శివార్లలో … ఓపెన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేద్దామని దాని వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉండవన్న కొన్ని సూచనలు వచ్చినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి.. విజయవాడ నడిబొడ్డునే ప్రమాణస్వీకారం చేయాలని నిర్ణయించారు. దాని ప్రకారమే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో… గట్టిగా పాతిక వేల మంది మాత్రమే పట్టే అవకాశం ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచి.. వైసీపీ క్యాడర్‌కు ఆహ్వానాలు పంపారు. కింది స్థాయి కార్యకర్త వరకూ.. పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఇంత భారీగా.. ఆహ్వానాలు పంపినప్పుడు… ఏర్పాట్లు అంతే చేయాలి. స్టేడియంలో చాలా మంది పట్టే అవకాశం లేదు కాబట్టి.. వేల మంది రోడ్లపైనే ఉంటారు. అందుకే… విజయవాడ వ్యాప్తంగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ ప్రాంతాలు.. ఇతర సౌకర్యాలు భారీగా చేస్తున్నారు. దీన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు కానీ.. వైసీపీ నేతలే.. కొత్త కొత్త అనుమానాలు వచ్చేలా ప్రకటనలు చేస్తున్నారు. జగన్ ఖర్చు లేకుండా.. నిరాడంబరంగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని.. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి.. మీడియా ముఖంగా ఘనంగా చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో.. అసలు విషయం చర్చల్లోకి వస్తోంది.
ఎన్నికలకు ముందు.. తెలుగుదేశం పార్టీ.. పార్టీ పరంగా… ధర్మపోరాట దీక్షలను నిర్వహించింది. అయితే.. అవన్నీ ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేశారని… వైసీపీ నేతలు.. జగన్ మీడియా ఆరోపణలు చేసింది. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని.. ఆరోపణలు చేశారు. ఇప్పుడు.. జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి.. అంతకు మించి ఏర్పాట్లు చేస్తూండటం.. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా .. ప్రమాణస్వీకార ఏర్పాట్లపైనే… పని చేస్తూండటంతో… ఈ విషయం సామాన్య ప్రజల్లో చర్చకు కారణం అవుతోంది. అందుకే… ఆ కార్యక్రమాన్ని నిరాడంబర కార్యక్రమంగా చెప్పుకునేందుకు వైసీపీ నేతలు… ఆసక్తి చూపిస్తున్నారు.
మామూలుగా అయితే.. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకార ఏర్పాట్లను.. టీడీపీ నేతలు ఎవరూ ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు. అందరూ ఓటమి షాక్‌లోనే ఉన్నారు. అయితే.. ఓ వైపు రాష్ట్రం అప్పుల్లో ఉందని… కేంద్ర సహకారం కావాల్సిందేనని.. అదే పనిగా చెబుతున్న వైసీపీ నేతలు… జగన్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లను సమర్థించుకోవడానికి సమర్థించుకోవడానికి స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. అదంతా నిరాడంబరంగా జరుగుతున్న కార్యక్రమంగా.. అసలు ఖర్చు లేని వ్యవహారంలా చెప్పుకునేందుకు తాపత్రయపడుతున్నారు. అందుకే..ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.