వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు జగన్ రెడ్డిని నమ్ముకోవడం కన్నా ఇప్పటి వరకూ జరిగింది చాలు అని టీడీపీకి సారీ చెప్పి సైడైపోవడం మంచిదని అనుకుంటున్నారు. రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో పదుల సంఖ్యలో ఖాతాల్లో ఆ మెసెజ్ కనిపిస్తోంది. ఇష్టం వచ్చినట్లుగా బరి తెగించిన వారు కూడా జగన్ రెడ్డిని నమ్ముకుంటే జైలుకు పోవడమే కానీ బయటకు వస్తామో రామో అని క్షమాపణలు వేడుకుకుటున్నారు.
ఒక్క శ్రీరెడ్డి కాదు పదుల సంఖ్యలో ఇలాంటి సారీ ప్రకటనలు కనిపిస్తన్నాయి.మరో వైపు తమకు సాయం చేయాలని వైసీపీ కార్యకర్తలు అడుగుతూంటే ఒక్కరూ స్పందించడం లేదు. పార్టీ ఆఫీసులో కాల్ సెంటర్ పెట్టారనేకానీ ఎంత మందికి సపోర్టు అందుతుందో స్పష్టత లేదు. లోకల్ ఇంచార్జులు అసలు పట్టించుకోవడం మావేశారు. కాస్త ఎక్కువ బూతులు తిట్టి.. బూతుల సోషల్ సైకోలుగా పేరు తెచ్చుకున్న వారి కోసం కొంత మంది వస్తున్నారు కానీ ఫేక్ అకౌంట్లతో బూతులు మాట్లాడిన వారి కోసం ఎవరూ రావడం లేదు.
చాలా మంది ఫేక్ పోస్టులతో వైసీపీ ఆఫీసు నుంచి వచ్చిన కంటెంట్ షేర్ చేసిన వారు ఇప్పుడు అవి చేసింది తామేనని బయటకు తెలియడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇంటి చుట్టుపక్కల వారు కూడా అసహ్యించుకునే ప రిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా రెండు వందల మందికి నోటీసులు ఇచ్చి వదిలి పెట్టి ఉంటారు. కానీ వారు చేసిన పోస్టుల వ్యవహారం మాత్రం.. వారింటి పక్కన ఉండే వారందరికీ తెలిసిపోయేలా చేశారు. దీంతో వారి ఇంట్లో వారు కూడా తలెత్తుకోలేని పరిస్థితి.
మొత్తంగా జగన్ రెడ్డిని నమ్ముకుని బూతుల బాటలోకి వెళ్లిన వారికి ఇప్పుడు వారిని చూపించి సానుభూతి రాజకీయం చేసి ఇంకా లభపడాలని జగన్ అనుకుంటున్నారు కానీ.. న్యాయసహాయం అయినా గట్టిగా చేస్తామని నమ్మకం కలిగించలేకపోతున్నారు.