జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు కులాలు లేవని.. తాను ఓ కులం కోసమే పని చేసి ఉంటే..ఆ వర్గం వారంతా తనకు మద్దతిచ్చేవారని.. కనీసం నలభై సీట్లు తెచ్చుకునేవాడినని చెబుతున్నారు. తాను అందిర వాడినంటున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అన్ని లిమిట్స్ క్రాస్ చేసి ఆయనపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఇటీవల విస్తరణలో మంత్రి పదవి పొందిన గుడివాడ అమర్నాథ్ జనసేన పార్టీ పై కులపరమైన విమర్శలు చేయడంలో ఏ మాత్రం తగ్గడం లేదు. .పవన్ కళ్యాణ్ ది కాపు జనసేన కాదు…కమ్మ జనసేన అని ఎద్దేవ చేశారు.నాదెండ్ల డైరెక్షన్ లో నడిచేది కమ్మ జనసేన అని,పవన్ నడిపేది కమ్మ జనసేన,అని కాపులు పవన్ ను ఓ న్ చేసుకునే పరిస్థితి లేదన్నారు.
విశాఖలో మీడియాతో మాట్లాడి నఆయన.. కులపరమైన విమర్శలతో జనసేనను టార్గెట్ చేయడమే కాకుండా అదే మాటలను సోషల్ మీడియాలో పెట్టారు. పవన్ కల్యాణ్ కాపు అయినా.. ఆయన పార్టీని నాదెండ్ల మనోహర్ నడుపుతున్నారని ఆయన కమ్మ కాబట్టి..జనసేనను కమ్మ పార్టీగా చెబుతున్నారు. అమర్నాత్ తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన ఈ పోస్టుకు.. కాపు సామాజికవర్గం వారే కాదు..జనసేన నేతలు.. ఇతరులుకూడా మండి పడుతున్నారు. ఓ బాధ్యతాయుతమైన మంత్రిగా ఉంది.. కులాల రాజకీయం చేయడం సిగ్గుగా లేదా అని ప్రశ్నిస్తున్నారు. మంత్రిగా ఉండి ప్రజలకు మంచి చేయాలి కానీ ఇలా కులం చిచ్చు పెట్టి రాజకీయం చేసి.. మంత్రిగా ఉండి.. ఏం బావుకుంటావని ప్రశ్నిస్తున్నారు.
అయితే పవన్ కల్యాణ్‌పై కుల ముద్ర వేయడంతో పాటు.. ఆయనను నిర్వీర్యం చేయడానికి పీకే టీం ప్రణాళికల ప్రకారం వ్యవహరిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. కొద్ది రోజులుగా కాపు నేతలతోనే పవన్ ను దారుణంగా తిట్టిస్తున్నారు . వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారు. ఇప్పుడు జనసేన పార్టీకే కులం అంటిస్తున్నారు. ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతోందని.. పవన్ కల్యాణ్ గట్టిగా తిప్పి కొట్టాలన్న వాదన జనసేన వర్గాల్లో వినిపిస్తోంది.