బెజవాడ ప్రకాశం బ్యారెజీని కూలగొట్టడానికి జరిగిన కుట్రలో భారీ లీడ్ దొరికినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు ఈ దిశగా స్పష్టమైన సమాచారం ఉండటంతోనే హోంమంత్రి అనిత ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంటలిజెన్స్ పూర్తి స్థాయిలో నిఘా పెట్టి.. సంచలన విషయాలను కనిపెట్టినట్లుగా తెలుస్తోంది.
కోటిన్నర ఖరైదీన బోట్లు – కనీసం ఫిర్యాదు కూడా లేదు !
ఆ బోట్ల ఖరీదు కనీసం కోటిన్నర ఉంటుంది. సాధారణ జాలర్లు వాటిని అలా వదిలి పెట్టరు. కొట్టుకుపోయిన తర్వాత ఆ బోట్ల యజమానులు ఫిర్యాదులు చేయలేదు. అంతే కాదు.. తమవి కావన్నట్లుగా సైలెంట్ గా ఉండిపోయారు. ఇక్కడే కుట్ర ఉందనడానికి అనుమానాలు బలపడ్డాయి. బోట్ల యజమానుల్ని అదుపులోకి తీసుకుని వారి ఫోన్లను విశ్లేషిస్తే అసలు విషయాలు బయటపడినట్లుగా తెలుస్తోంది.
తలశిల ద్వారా ప్లాన్ అమలు
సజ్లల రామకృష్ణారెడ్డి.. తలశిలకు పదే పదే ఫోన్లు చేసి వరద వస్తున్న సమయంలో బోట్ల కుట్రను అమలు చేశారు. ఇక ఇసుక అక్రమ తవ్వకాలు అనుమతించరు కాబట్టి ఆ బోట్ల వల్ల ఉపయోగం లేదని.. వాటిని బ్యారేజీపై అస్త్రాలుగా వాడాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఎలా అయితే బ్యారేజీ వద్దకు చేరుతాయో బాగా అంచనా వేసి గొల్లపూడి వద్దకు తెచ్చి .. అన్నింటిని కలిపి వెళ్లేలా ప్లాన్ చేశారు. కోమటి రామ్మోహన్ అనే బోటు యజమానికి తలశిల రఘురాం పలుమార్లు ఫోన్ చేశారు. బోట్లను కూడా పరిశీలించి వెళ్లారని పోలీసులు గుర్తించారు.
కాల్ డేటాతో వీడిపోనున్న గుట్టు
సాధారణంగా ఎవరైనా ప్రమాదం అనుకుంటారు. బోట్లలో కొట్టుకు వచ్చాయనుకుంటారు. అలా చేసి భారీ కుట్ర చేసి ప్రజల్ని చంపేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ బోట్లు కౌంటర్ వెయిట్లను ధ్వంసం చేసి ఆగిపోయాయి. దాంతో ప్రజలు బయట పడ్డారు. కానీ ఇప్పుడు అసలు కథ ప్రారంభమవుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డికి అలా చేయమని చెప్పింది ఎవరన్నది ఇప్పుడు కీలకం. పోలీసులు వచ్చే వారం రోజుల్లోనే ఈ కుట్రను బట్టబయలు చేయనున్నారు.