వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయనను అత్యవసరంగా ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు వంద శాతం ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తున్నట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. చల్లా భగీరథరెడ్డి కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గానికి చెందినవారు. ఆయన వైసీపీ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేరు కానీ..ఆయన తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి మాత్రం మాజీ ఎమ్మెల్యే.
ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఆయన పేరు ఎక్కువగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజన తర్వతా ఆయన రాజకీయ ప్రభావం తగ్గింది. తర్వాత టీడీపీలో చేరారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరడంతో ఆయనకు జగన్ ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ కరోనా సోకడంతో ఆయన చనిపోయారు. ాయన స్థానంలో భగీరధరెడ్డికి జగన్ చాన్సిచ్చారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా మారింది.
45 ఏళ్ల భగీరథరెడ్డి ప్రస్తతం తండ్రిలా రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు . ఈసమయంలో అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు వచ్చిన అనారోగ్యం ఏమిటన్నదానిపై స్పష్టత లేదు కానీ.. కాలేయం, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం అవుతోందని చెబుతున్నారు. ఆయన కోలుకోవాలని వైసీపీ నేతలు ఆకాంక్షిస్తున్నారు.