రంగుల పిచ్చిలో పడ్డ వైసీపీ నేతలకు కన్నూమిన్నూ కానరావడం లేదు. తిరుపతిలో దేవుడి బొమ్మలను తీసేసి వైసీపీ రంగులు వేసిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమయింది. తిరుపతి ప్రజల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. అలిపిరికి వెళ్లే దారిలో వైఎస్ఆర్సీపీ రంగుు, ఫ్లెక్సీలతో నింపేశారు. గోడలకు ఉండాల్సిన దేవుడి బొమ్మలు తొలగించి వైఎస్ఆర్సీపీ రంగులు వేశారని కొంత మంది మండిపడ్డారు. ఈ వీడియోలు వైరల్ అయింది.
అయితే ఈ ఆరోపణలను వైఎస్ఆర్సీపీ ఖండించింది. దేవుడి బొమ్ములు అలాగే ఉన్నాయని.. తెలుగుదేశం పార్టీ నేతలు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని నాలుగు చోట్ల దేవుడి బొమ్మలున్న వీడియోను ప్రదర్శించింది. అయితే వెంటనే తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సమాధానం ఇచ్చింది. కిలోమీటర్ల మేర ఉండే దేవుడి బొమ్మలను తొలగించి.. ఓ నాలుగు బొమ్మలను మాత్రం ఉంచారని.. మిగతా మొత్తం తొలగించారని స్పష్టం చేసింది. ఆ మేరకు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
వైఎస్ఆర్సీపీ వాదన ఫేక్ అని తేలిపోవడంతో వెంటనే తిరుపతి నగరపాలక సంస్థ కూడా రంగంలోకి దిగింది. అక్కడి బొమ్మలు పాతవైపోయినందున కొత్తగా వేయడానికి రంగులు వేశామని.. అవి మామూలు రంగులేనని వైఎస్ఆర్సీపీ రంగులు కాదని కొత్త వాదన తీసుకొచ్చింది. తప్పు చేసి దాన్ని సమర్థించుకునేందుకు తప్పు మీద తప్పు చేస్తున్న వైసీపీ నేతల తీరు జనం అసహ్యించుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.