లాయర్లకు పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తోందని వైసీపీ మీడియా, సోషల్ మీడియా తెగ బాధపడుతోంది. ముఖ్యంగా సిద్దార్థ లూధ్రాకు ప్రతి కేసు వాదించే బాధ్యత ఇస్తున్నారని ఫీలైపోతున్నారు. అంతా చేసి ఎంత ఇచ్చారంటే.. లక్షలే ఇచ్చారు. కానీ వైసీపీ నేతలు మాత్రం తమ హయాంలో జరిగిన చెల్లింపుల గురించి పూర్తిగా మర్చిపోయారు. వారికి గుర్తున్నా.. మర్చిపోయినట్లుగా నటిస్తారు. ఎందుకంటే.. వారు ఇచ్చింది కోట్లలోనే.
ప్రజా రాజధానిని నిర్వీర్యం చేసి.. ఆ కేసుల్ని వాదించడానికి ఓ లాయర్ కు ఏకమొత్తంగా ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన చరిత్ర వైసీపీది. అది ఒక్క లాయర్ కు సింగిల్ టర్మ్. అదేలాయర్ కు ఎన్ని కోట్లు ఇచ్చారో అంచనా వేయడం కష్టం. ఆయనొక్కరే కాదు.. ప్రతీ కేసును సుప్రీంకోర్టు వరకూ తీసుకెళ్లడం ప్రజాధనాన్ని అప్పనంగా లాయర్లుకు దోచిపెట్టడం కామన్ గా జరిగేది. ఆ కేసు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడదని చెట్టుకింద ప్లీడర్లు కూడా చెప్పగలిగినా సరే సుప్రీంకోర్టుకు వెళ్లేవారు.
పొన్నవోలు సుధాకర్ రెడ్డికే కోట్లు చెల్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే.. అప్పటికి లాయర్ గా నమోదు చేసుకోని.. రఘురామ కేసులో నిందితుడు అయిన కామేపల్లి తులసిబాబుకు కూడా యాభై లక్షలు చెల్లించారు. తులసీబాబుకే అంత చెల్లిస్తే ఇతర లాయర్లకు ఎంత చెల్లించి ఉండాలి. తప్పు చేసిన వైసీపీ నేతల విషయంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయకూడదన్నట్లుగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కానీ వారితో పోలిస్తే.. ఏపీ ప్రభుత్వం వినియోగించుకుంటున్న లాయర్లు ప్రజాప్రయోజనాలను కాపాడుతున్నట్లే అనుకోవచ్చు.