ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా.. చాలా సేపు సస్పెన్స్ తర్వాత అసలు విషయం అర్థమయిందని బ్రహ్మానందం చెప్పిన డైలాగ్.. ఇప్పటి రాజకీయాలకు కరెక్ట్ గా సూటవుతుంది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంత తేలిక కాదని రచ్చ అయిపోతుందని వైసీపీ ఆశలు పెట్టుకుంది. అలా చేయడానికి జనసేన పార్టీలో ఊరుపేరూ లేని నాయకులకు ఎలివేషన్లు ఇచ్చేందుకూ తగ్గడం లేదు. కానీ అసలు విషయం ఏమింటే.. సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేన అగ్రనేతలకు ఓ క్లారిటీ ఉంది. దాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో వారికో విజన్ ఉంది. ఆ ప్రకారమే ముందుకు వెళ్తున్నారు.
పవన్ కల్యాణ్ తన బలాన్ని ఈ సారి అతిగా ఊహించుకోవడం లేదని ఆయన మాటల ద్వారానే స్పష్టమవుతుంది. పార్టీ క్యాడర్ కు ఆయన ఓ దిశానిర్దేశం పంపుతున్నారు. చాలా కాలం నుంచి ఆయన చెప్పాలనుకున్నది చెబుతున్నారు. పట్టుబట్టి సీట్లు తీసుకుని వైసీపీకి మేలు చేయడం కన్నా.. ఖచ్చితంగా గెలిచే సీట్లలోనే పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఆ ప్రకారమే కసరత్తు జరిగింది. ఎన్ని సీట్లు ఇవ్వాలి.. ఏయే సీట్లు ఇవ్వాలన్న దానిపై ఆరు నెలల కిందటే ఓ అభిప్రాయానికి వచ్చారని టీడీపీ, జనసేన వర్గాలు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగానే మార్పులు చేర్పులు జరుగుతున్నాయని అంటున్నారు.
అయితే ఎన్ని సీట్లు ఇస్తారు.. ఏయే సీట్లు ఇస్తారన్నదాన్ని వ్యూహాత్మకంగా ప్రజల్లోకి .. పార్టీ క్యాడర్ లోకి పంపాలనుకుంటున్నారు. ఆ కార్యాచరణ ప్రారంభమయింది. ఈ వ్యూహాన్ని అర్థం చేసుకోలేని వైసీపీ.. జనసేనను రెచ్చగొడుతున్నామనుకుని ఆ పార్టీకి పబ్లిసిటీ ఇస్తోంది. చంద్రబాబు పది సీట్లు ఇస్తారని ఓ సారి… కనీసం నలభై సీట్లు ఇస్తారని మరోసారి పొంతన లేకుండా నీలి,కూలి మీడియా ప్రచారం చేస్తోంది. నిజానికి అసలు సమాచారం చంద్రబాబు, పవన్ కు తప్ప ఎవరికీ తెలియదు. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ పవనే చంద్రబాబు తో భేటీకి వచ్చారంటే… ఎంత వ్యూహాత్మకంగా రెండు పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే.. తమ పార్టీ స్థానం ఎక్కడ ఉంటుందో వైసీపీకి తెలుసు కాబట్టి.. రెచ్చగొట్టి చిచ్చు పెట్టేందుకు చేయగలిగినదంతా చేస్తోంది. దమ్ముందా అంటూ డైలాగులు కూడా కొడుతున్నారు. అవన్నీ ఔట్ డేటెడ్ పాలిటిక్స్ అని.. అసలు కథ తాము చూపిస్తామని.. టీడీపీ, జనసేన.. స్క్రీన్ ప్లే నడిపిస్తున్నాయి