వైసీపీ అంటే శవాల పునాదుల మీద పుట్టిన పార్టీ అని విపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. ఆ పార్టీ ప్రస్థానం చూస్తే.. ప్రతి విజయం వెనుక ఓ శవం ఉంటుంది. ఆ పార్టీ పెద్దల వ్యూహం కూడా అందుకు అనుగుణంగానే ఉంటుంది. ఈ సారి కూడా అలాగే ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రతీ అయినట్లుగా ఈ సారి జరగడంలేదు. రివర్స్ అవుతోంది. సొంత ఓటర్లు కూడా ఇంత రాజకీయమా అని తిట్టి పంపిచేస్తున్నారు.
శవం తీసుకెళ్లేందుకు ప్రయత్నించి తిట్టించుకున్న జోగి రమేష్
పెనుమలూరులో ఓ వృద్ధురాలు చనిపోతే.. శవాన్ని తీసుకెళ్లి రాజకీయం చేస్తానని జోగి రమేష్ పట్టుబట్టారు. వైసీపీ సానుభూతిపరులు ఎక్కువగా ఉన్న చోట ఆమె చనిపోయారు. ఇదే సందనుకుని శవం తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఆ వృద్ధురాలి బంధువులు పిచ్చి తిట్లు తిట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంత ఘోరంగా ఉన్నారంటే.. రాబందుల కన్నా ఘోరంగా ఉన్నారని రాష్ట్రం మొత్తం అనుకున్నారు. గతంలో ఇలాంటి రాజకీయాలు చేయాలంటే అడ్డం లేకుండా పోయేది ఇప్పుడు సొంత వాళ్లే అడ్డగోలుగా తిట్టి పంపిస్తున్నారు. ఇదీ వచ్చిన మార్పు
శవాల పునాదుల మీద నిలబడిన వైసీపీ
వైసీపీ ఎలా పుట్టిందని కాస్త ఆలోచిస్తే.. ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన తరవాత ఆయన కోసం గుండెపోటుతో చనిపోయారంటూ.. రాష్ట్రంలో ఎవరు చనిపోయినా.. ఓ లిస్ట్ తయారు చేసుకున్నారు. సాక్షి పత్రికలో రాసుకున్నారు. తర్వాత ఓదార్పు యాత్ర పేరుతో జగన్ వైసీపీకి పునాదులు వేసుకున్నారు. ఆ ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వలేదని.. సొంత పార్టీ పెట్టుకున్నారు. అంటే… సహజమరణాలు చెందిన వారు శవాలను పునాదులుగా చేసుకుని వైసీపీ పార్టీ పెట్టారు.
ప్రతీ ఎన్నికకు ముందు శవాలతో రాజకీయం !
వైసీపీ ఎప్పుడు మంచి ఫలితాలు సాధించినా దాని వెనుక ఓ శవం ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్య ద్వారా చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. ఇప్పుడు పించన్ల కోసం ఎండల్లో సచివాలయాలకు వచ్చేలా చేసి ఎండలకు వారు చనిపోతే.. ఆ శవాలతో రాజకీయం చేసేందుకు సిగ్గుపడకుండా ప్రయత్నిస్తున్నారు. వైసీపీకి ఈ శవాల ఫాంటసీ ఏమో కానీ.. ప్రజలకు మాత్రం అసహ్యం వేసే రాజకీయాలు చేస్తున్నారు.