చంద్రబాబు సమీక్ష చేసి ఉంటే.. అకాల వర్షాలు, ఎండల వల్ల చనిపోయిన వారు బతికి ఉండేవారా..? . మరణాలు ఆగేవా..?… ఇదీ.. కేంద్ర ఎన్నికల సంఘానికి … టీడీపీ అధినేత రాసిన లేఖకు .. వైసీపీ నుంచి వచ్చిన కౌంటర్. ఏ మాత్రం.. మానవవత్వం లేకుండా… చనిపోయేవారు చనిపోతూనే ఉంటారు.. వారి కోసం ఏమీ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా.. ఉన్న ఈ స్పందన… చాలా మందికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. ఇలా కూడా ఆలోచిస్తారా..? ఇలా కూడా విమర్శలు చేస్తారా..? అని అనుకోవచ్చు. కానీ.. నిజంగా వైసీపీ నేతలు ఇలాగే ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, ఎండల కారణంగా.. వారం రోజుల్లో ఏడుగురు చనిపోయారని.. ప్రభుత్వ పరంగా.. సమీక్షలు చేసి..ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడానికి అధికారం లేదని.. సీఈవో చెప్పడం ఏమిటని…చంద్రబాబు.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారని.. ప్రశ్నించారు. దీనిపైనే వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాలన అంటే.. కనీస అవగాహన లేకుండా.. వైసీపీ నేతలు ఇలా వ్యాఖ్యానిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, కరువు, నీటి ఎద్దడి వంటి వాటికి తగిన చర్యలు తీసుకోడం.. ప్రభుత్వం ప్రాథమిక కర్తవ్యం. చంద్రబాబు తన లేఖలో అదే చెప్పారు. అయినప్పటికీ.. వైసీపీ నేతలకు అది నచ్చలేదు. ఏపీలో పరిస్థితుల్ని చూసి.. చంద్రబాబుకు ఎక్కడ ఎన్నికల నిబంధనల సడలింపు ఇస్తుందోనన్న ఆందోళనతో నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరణాలను ఎవరూ ఆపలేరు కానీ.. కనీసం మానవ ప్రయత్నం చేయడం మానవత్వం అన్న సంగతిని… వైసీపీ నేతలు గుర్తుంచుకుంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ వైసీపీ నేతలు… ఎప్పుడూ.. ఈ కోణంలో రాజకీయాలు చూడలేదు. వారిదంతా.. పదవీ రాజకీయాలేనని.. టీడీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు.