జూబ్లిహిల్స్ కొండ… మణికొండ… వైజాగ్ రుషికొండ.. .. తిరుమల కొండలు ఏదైవా వైసీపీకి ఒక్కటే. జూబ్లిహిల్స్ కొండల మీద ఇళ్లు కట్టుకున్నారు కాబట్టి.. ప్రపంచంలో ఏ కొండపైనైనా ఇళ్లు కట్టుకోవచ్చు. రోడ్లు వేసుకోవచ్చు. ఇష్టం వచ్చిటన్లుగా తొలిచేయవచ్చు. ఇది వైసీపీ లాజిక్. ఇక ఏ పర్యావరణ నిబంధనలు.. అక్కర్లేదు. ప్రజల్ని పిచ్చి వాళ్లను చేయడానికి వైసీపీ నేతలు చేసే వింత వాదనల్లో ఇది ఒక శాతమే.. ఇతర అంశాల్లోనూ వారు చెప్పే వాదనలు వింటే.. ప్రజల్ని ఓ మాదిరిగా కూడా చూడని వీళ్లు మన పాలకులా అనిపిస్తుంది. దానికి చక్కని ఉదాహరణ.. గిరిజనుల దగ్గరకు పోయి.. వారికి తానేం చేయలేనని చెప్పడానికి మన దగ్గర డబ్బుల్లేవు.. మోడీ దగ్గర డబ్బులు ప్రింట్ చేసే యంత్రాలుంటాయని చెప్పుకోవడం.
ఇంత దారుణంగా ప్రజల్ని మోసం చేయడానికి అలవాటు పడిన వారు చేసే వాదనలు ఇలాగే ఉంటాయి. రుషికొండ. లేకపోతే హుదూద్ వచ్చినప్పుడు విశాఖ ఏమైపోయేదో అని నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. పైగా అది తీర ప్రాంత నిబంధనలు సీఆర్జెడ్ ప్రాంత పరిధిలోకి వస్తుంది. తీరాన్ని కాపడటానికి… భవిష్యత్ లో ప్రకృతి వైపరీత్యాల నుంచి వచచే ప్రమాదాల్ని కాపాడుకోవడానికి ఇలాంటి ప్రకృతి సిద్ధ నిర్మాణాలు ఉండాలని.. వాటికి ఇబ్బంది కలగకూడదని ఈ నిబంధనలు తెచ్చారు. కానీ మొత్తం నాశనం చేసి పెట్టేశారు. వర్షం పడితే ఇప్పుడు వైజాగ్ బీచ్ రోడ్ అంతా ఎర్రనీరు పారుతోంది. రుషికొండ ఎర్రమట్టి దిబ్బలు కరిగిపోతున్నాయన్నమాట.
ఓబులాపురంలో ఉన్న ఐరన్ ఓర్ కొండల్ని కొల్లగొట్టారు… సుంకులమ్మ ఆలయాన్ని కూలదోసి… మొత్తానికి నాశనం అయ్యారు. తిరుమల ఏడుకొండలు కాదు మూడు కొండలేనని తీర్మానించారు. ఆ తర్వాత జరిగిన నష్టం గుర్తుందో లేదో. ఇప్పుడు అన్ని కొండల్ని ఒకే గాటన కట్టి.. ఇష్టారీతిన విధ్వంసానికి పాల్పడుతున్నారు. ప్రజలు పరిపాలన చేయమని ఇచ్చారు కానీ… అడ్డగోలుగా దొరికినంత దోచుకోమని కాదు. కానీ చైతన్యం నశించిన సమాజాన్ని.. పెంచి పోషిస్తూ.. వారు అరాచకాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన సమయం వచ్చేసింది.