ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో భాగంగా.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఫిబ్రవరి పధ్నాలుగో తేదీన అమరావతి వెళ్తారని… టీఆర్ఎస్, వైసీపీ నేతలు.. కాస్త గట్టిగానే చెప్పారు. జగన్ తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన గృహప్రవేశ కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతారని .. ఆ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ చర్చలు… కూటమిలో వైసీపీ చేరిక.. ఖరారవుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే.. ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కేసీఆర్ .. జగన్ గృహప్రవేశానికి వస్తారా రారా.. అన్న అంశంపై అటు టీఆర్ఎస్ వర్గాలు కానీ.. ఇటు.. వైసీపీ వర్గాలు కానీ పెద్దగా స్పందించడం లేదు. నిన్న వైసీపీ వర్గాల నుంచి మీడియాకు.. ఓ సమాచారం వచ్చింది. ఫిబ్రవరి పధ్నాలుగో తేదీన.. జగన్ గృహప్రవేశం ఉంటుందని.. ఆ సమాచారం. అదే సమయంలో… టీఆర్ఎస్ వర్గాల నుంచి మరో లీక్ వచ్చింది. విశాఖలో శారదాపీఠాధిపతి నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమానికి కేసీఆర్‌కు ఆహ్వానం వచ్చిందనేది.. ఆ లీక్ సారాంశం. ఈ రెండింటిని చూసిన వారికి.. బహుశా కేసీఆర్.. ఈ రెండు కార్యక్రమాలకు వెళ్తారని.. అనుకున్నారు. కానీ.. టీఆర్ఎస్ వర్గాలు.. ఒక్క శారదా పీఠం కార్యక్రమం గురించే పదే పదే చెప్పాయి కానీ.. జగన్ ఇంటి వేడుకకు హాజరుపై మాత్రం .. నోరు మెదపలేదు.
ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే… కేసీఆర్‌తో అంతకు మించి.. రాజకీయం చేస్తే.. మొదటికే మోసం వస్తుందని జగన్మోహన్ రెడ్డి రియలైజ్ అయ్యారని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్‌తో భేటీ అయిన వెంటనే.. ఏపీలో వచ్చిన రియాక్షన్.. ఫీడ్ బ్యాక్ రూపంలో జగన్మోహన్ రెడ్డికి అందిందని.. అదంతా నెగెటివ్‌గా ఉండటం వల్ల… ఆయన .. డిఫెన్సివ్ మోడ్‌లో పడ్డారని చెబుతున్నారు. అందుకే.., టీఆర్ఎస్తో తమ అనుబంధం జాతీయ స్థాయిలో ఉంటుందని పదే పదే ప్రకటనలు చేశారు. ఆ తర్వాత.. టీఆర్ఎస్ ప్రస్తావన తగ్గించారు. ఒక వేళ.. కేసీఆర్ గనుక..విజయవాడలో జగన్‌తో సమావేశమై… మీడియాతో మాట్లాడితే.. అ ఇంపాక్ట్ ఎంత తీవ్రంగా ఉంటుందో అంచనా వేయలేమన్న అంచనాలు జగన్‌ను గందరగోళానికి గురి చేశాయని.. ఇప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకన్న భావనకు వచ్చారని చెబుతున్నారు.
ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితి చూస్తే.. కేసీఆర్‌ను.. ఇక ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టవద్దని.. జగన్ విజ్ఞప్తి చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఫిబ్రవరి పధ్నాలుగో తేదీన.. విశాఖ పీఠానికి… కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడం ఖాయమే. విశాఖ పీఠాధిపతి…కేసీఆర్‌కు ఇష్టమైన యాగాలను చేయించారు కాబట్టి.. ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించే అవకాశం ఉండకపోవచ్చు. అయితే.. ఏ కార్యక్రమంతో.. ఏపీకి వచ్చినా.. కేసీఆర్ టూర్‌పై రాజకీయ ముద్ర ఉంటుంది. ఎందుకంటే.. శారదాపీఠాధిపతి.. జగన్‌కు కూడా.. ఆధ్యాత్మక గురువుగా వ్యవహరిస్తూంటారు మరి..!