పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ కోర్టులో వాంగ్మూలం ఇవ్వడానికి మంగళగిరి వచ్చారు. అయి తిరిగి వెళ్లాల్సిన రోజున… ఉదయం గవర్నర్ వద్దకు వెళ్లారు. గంజాయి అంశంపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఇ,ష్యూలో అంతకు మించి ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో లెటెస్ట్ గా చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే… . గవర్నర్‌తో లోకేష్ సుమారు 15 నిమిషాల సేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. కేవలం గంజాయి విషయమై ఫిర్యాదు చేయడానికే లోకేష్ వచ్చి ఉంటే.. మిగిలిన నేతలతో కలిసి ఫిర్యాదు ఇచ్చి.. చర్యలు తీసుకోమని వినతి పత్రం ఇచ్చి వెళ్లిపోయి ఉండేవారు. కానీ అలా కాకుండా గవర్నరుతో ఏకాంతంగా భేటీ అయ్యారంటే…. ఏదో ఉందని వైసీపీలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
గవర్నరుతో లోకేష్ ఏకాంతంగా జరిపిన భేటీలో గంజాయి గురించి కాకుండా.. అంతకు మించే చెప్పి ఉండొచ్చు. లోకేష్. గవర్నర్‌తో ఏకాంతంగా ఏం మాట్లాడానోననే విషయాన్ని ప్రస్తుతానికి లోకేష్ ఎవ్వరికీ చెప్పకున్నప్పటికీ.. ఎవరైనా.. ఏదోక సందర్భంలో అడిగితే వీరిద్దరి ఏకాంత భేటీ వివరాలు రావచ్చు. ఇంతకీ కొసమెరుపు ఏంటంటే.. గవర్నరును కలవడానికి లోకేష్ వెళ్లారా..? లేక పైస్థాయిలో ఉన్న పెద్దలెవరైనా గవర్నర్‌ను వెళ్లి కలవాల్సిందిగా లోకేష్‌కు సూచించారా..? అనేది ఎక్కువ మందికి వస్తున్న సందేహం.
ఎందుకంటే అధికారం కొల్పోయిన తర్వాత లోకేష్ గవర్నర్‌ను తొలిసారి కలిశారు. గత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఎప్పుడూ కలవలేదు. ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు. కానీ గవర్నర్ మారిన తర్వాత. కూడా ఎప్పుడూ కర్టసీకి కూడా కలవలేదు. మొదటి సారి కొత్త గవర్నర్‌ను కలిసి గంజాయి వినియోగంపై ఫిర్యాదు చేశారు. అది కూడా తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి మరీ అమరావతికి వచ్చి గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు . అందుకే ఈ భేటీ రాజకీయ కోణంలోనే అని ఎక్కువ మంది అనుమనిస్తున్నారు.