అనుకూలమైన తీర్పు లేదా న్యాయమూర్తుల కామెంట్లు వస్తే వైసీపీ న్యాయవ్యవస్థను మించిన గొప్పది లేదని ప్రచారం చేస్తుంది. మరి ఈ ప్రచారం అంతా ఉంటుందా.. ఈ నమ్మకం అన్ని తీర్పులకు వర్తిస్తుందా అంటే… ఏదైనా కేసులో తమకు వ్యతిరేకంగా తీర్పు లేదా కామెంట్స్ రాగానే ఆ పాలసీ మారిపోతుంది. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేశాడని అసువుగా అనేస్తారు. ఇలాంటి డబుల్ గేమ్ తో వ్యవస్థల విశ్వసనీయతనూ వైసీపీ ప్రశ్నార్థకం చేస్తోంది.
కోర్టులంటే కనీస గౌరవం లేని జగన్
వైసీపీ అధినేత జగన్ ఎన్నో అత్యంత తీవ్రమైన కేసుల్లో నిందితుడు. కానీ ఆయన కోర్టు మెట్లెక్కడానికి నామోషీ ఫీలవుతున్నారు. ఎంతగా అంటే కోర్టుకెళ్లి పూచికత్తు సమర్పిస్తే తనకు పాస్ పోర్టు వస్తుంది విదేశీటూర్ కు వెళ్లవచ్చు. కానీ కోర్టుకెళ్లడం ఇష్టం లేక కుమార్తె పుట్టిన రోజు వేడుకలను కూడా వదిలేసుకుని ఇండియాలోనే ఉండడిపోయారు. ఆ కేసు కొట్టి వేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకున్నారు. ఇంత ఘోరమైన మనస్థత్వం ఉన్న వ్యక్తి పదే పదే.. కోర్టుల వద్దకు న్యాయం కావాలంటూ పరుగెడుతున్నారు. అక్కడ విచారణలో న్యాయమూర్తులు చేసే కామెంట్లను గొప్పగా ప్రచారం చేసుకుని తప్పు జరగలేదని తీర్మానించేసుకుంటున్నారు.
ముందు ముందు లడ్డూ అంశంపై కోర్టు వ్యాఖ్యలు వ్యతిరేకంగా ఉన్నా ఇలానే అంగీకరిస్తారా ?
ఇది ప్రాథమికమే . ఇంకా చాలా విచారణలు ఉన్నాయి. టీటీడీ, ప్రభుత్వం లడ్డూ కల్తీపై ఇప్పటి వరకూ ఆధారాలను ఇంకా సుప్రీంకోర్టు ముందు పెట్టలేదు. గురువారం కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు విషయంలో తన అభిప్రాయం చెబుతుంది. సిట్ ద్వారా కొనసాగించి.. కేంద్రం దర్యాప్తు చేసినా పెద్ద తేడా ఉండదు. డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ తో మొత్తం బయటకు వస్తాయి. అప్పుడు కూడా కోర్టులు చేసే కామెంట్లకు , తీర్పులకు ఇదే విధంగా స్పందిస్తారా ? అన్నదే ప్రశ్న. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు వైసీపీ నేతలకు వ్యతిరేకంగా ఉంటే ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా మేనేజ్ చేసేవారనిి సోషల్ మీడియాలో నిందిస్తూ ఉండేవారు కాదా !
వ్యతిరేకకంగా వస్తే మేనేజ్ చేశారంటారు.. అనుకూలంగగా వస్తే ఓకే – ఇదేం డబుల్ గేమ్ !
ఈ ఒక్క విషయంలోనే కాదు. కోర్టుల విషయంలో వైసీపీ స్ట్రాటజీ ఇదే. అధికారంలో ఉన్నప్పుడు న్యాయమూర్తుల్ని బ్లాక్ మెయిల్ చేసినట్లుగా చేశారు. సోషల్ మీడియాలో వారు పెట్టించిన పోస్టులు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను కొట్టేస్తే నిందలు వేశారు. తమకు అనుకూలంగా తీర్పులు వచ్చినప్పుడు మాత్రం స్వాగతించారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను అత్యంత ఘోరంగా ప్రశ్నించే పార్టీ వైసీపీ. ఇప్పటికీ అదే పాలసీలో ఉంది.