సీఎం జగన్ “తెలుగు ఫ్లాగ్” అంటూ చేసిన ఓ ట్వీట్‌పై బాలీవుడ్ టాప్ సింగర్ అద్నాన్ సమీ… ఇలా దేశాన్ని సెపరేట్ చేయవద్నది.. తెలుగు జెండా ప్రత్యేకంగా ఉండదని.. మనందరం భారతీయులమని..మనకు ఇండియా జెండా ఒక్కటే ఉంటుందని ఇచ్చిన రిప్లయ్ పై వైసీపీఫ్యాన్స్ ఆయనతో సోషల్ మీడియాలో గొడవ పెట్టుకున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో పని చేసే కొంత మంది ఎక్కున పాలోయర్లు ఉన్న అకౌంట్లతో పాటు మంత్రి విడదల రజనీ, సలహాదారు రాజీవ్ కృష్ణ వంటి వారు కూడా స్పందించారు. వారికి కూడా అద్నాన్ సమీ కౌంటర్ ఇచ్చారు.
మంత్రి విడదల రజనీ.. రాజకీయ నాయకులకు ఇచ్చిన కౌంటర్ లాగా ఎదురుదాడి చేయడంతో అద్నాన్ సమీ ఘాటుగా రిప్లై ఇచ్చారు. అదే సమయంలో సలహాదారు రాజీవ్ కృష్ణ.. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సలహా ఇచ్చారు. దీనికీ అద్నాన్ సమీ కౌంటర్ ఇచ్చారు. దేశభక్తి ప్రదర్శించడానికి పాఠాలు అక్కర్లేదని కానీ రాజకీయ నాయకులు స్టేట్స్‌మెన్‌గా వ్యవహరించడానికి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉందని సెటైర్ వేశారు. ఈ అంశంపై అద్నాన్ సమీ చాలా మంది సమాధానం ఇచ్చారు.
అద్నాన్ సమీ పాకిస్థాన్ తండ్రికి, ఇండినన్ తల్లికి జన్మించారు. మొదట ఆయనకు పాకిస్తాన్ పౌరసత్వమే ఉండేది. కానీ ఆయన వదులుకుని ఇండియా పౌరసత్వమే తీసుకున్నారు. ఆయనకు పద్మశ్రీని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఆయన అసలు ఇండియనే కాదని.. పాకిస్తానీయుడని వైసీపీ సోషల్ మీడియా ఫ్యాన్స్ విమర్శలు , బూతులు అందుకుంటున్నారు. ఇలాంటి వి అద్నాన్ సమీ చాలా చూసి ఉంచారు కానీ.. సెన్సిబుల్ విమర్శలకు స్పందించి సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో అతిగా స్పందించి వైసీపీ నేతలు తమ పార్టీ పరువును జాతీయంగా.. అంతర్జాతీయంగా మరోసారి తీసుకున్నట్లయింది.