అతడు సినిమాలో చూపించినట్లుగా రాజకీయాలను చేయడం అందరి వల్లా కాదు. ఎంత రాజకీయ నాయకుడు అయినా ఇలా ఎలా చేస్తాం అనుకుంటారు.. కానీ వైసీపీ నేతలకు అలాంటి బెరుకే ఉండదు. ప్రజలు నవ్వుతారని తెలిసినా కూడా తమను నమ్మేవారుంటారని.. వారు నమ్మితే మిగిలిన వారని నీలి, కూలి మీడియా.. సోషల్ మీడియతో నమ్మించవచ్చని అనుకుంటున్నారు. అందుకే వీధి డ్రామాలకు తగ్గని రీతిలో .. నటన కురిపిస్తూ ప్రజల ముందుకు వస్తున్నారు.
రాయి తగిలిందో లేదో తెలియదు.. కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు పొద్దున్నే పోయి కంటికి ఓ బ్యాండేజ్ వేయించుకుని ఫోటోలు తీయించుకున్నారు. తనకేదో తీవ్రమైన గాయం అయిందన్నట్లుగా షో చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి వి అయితే చెప్పాల్సిన పని లేదు. ఆయన ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఏకంగా ఆపరేషన్ రూమ్ లో టెస్టులు చేయించుకుని పది మంది వైద్యుల బృదంతో ఫోటో దిగారు. అక్కడేదో బ్రెయిల్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ జరిగింది… పేషంట్ వెంటనె లేచి కూర్చున్నాడన్నట్లుగా బిల్డప్. మళ్లీ అక్కడ ఆయన తన కాలుకు కూడా గాయం అయిదని చూపించడానికన్నట్లు దానికో కట్టు. ఇక ఆపరేషన్ దస్తులతో కలిసి ఓ ఫోటో కూడా రిలీజ్ చేశారు.
ఎవరైనా రోడ్డు మీద ఐదేళ్ల చిన్న పిల్లాడు సైకిల్ తొక్కుతూ పడిపోతే అంత కంటే పెద్ద గాయాలే అవుతాయి. కానీ అలా పడి లేచిన మరుక్షణం మళ్ళీ సైకిల్ తొక్కుతాడు.. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓ రోజు విశ్రాంతి తీసేసుకున్నారు. ఆ విశ్రాంతిలో నీలి,కూలీ మీడియాకథలు అల్లితే వాటిని చూసి చిద్విలాసంగా రాజీకయం అంటే ఈ డ్రామాలే అన్నట్లుగా వ్యూహాలు పన్నుతున్నారు. ఇక వైసీపీలోని నటుల సంఘం సీనియర్ యాక్టర్ల గురించి చెప్పాల్సిన పని లేదు. వాళ్ల ఓవరాక్షన్ చూసి ప్రజలకు కూడా ఇదేదో… తేడాగా ఉందే అనిపించేలా చేసుకున్నారు.
రాజకీయ డ్రామాలపై ప్రజలకు అవగాహన పెరిగినట్లుగానే కనిపిస్తోంది. వైసీపీ సొంత సోషల్ మీడియా ఖాతాల్లోనే జగన్ డ్రామాలపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. పథకాల గురించి చెప్పుకుని మగాడిలా రాజకీయాలు చేద్దామన్నా.. ఈ డ్రామాలతో ప్రజలు నవ్వుతున్నారని సొంత పార్టీ కార్యకర్తల ఆక్రందనలు సోషల్ మీడయాలో వినిపిస్తున్నాయి. కానీ హోప్స్ లేని రాజకీయానికి డ్రామాలతో గాలి కొట్టాలని జగన్ మోహన్ రెడ్డి అండ్ కో నటుల సంఘం గట్టి ప్రయత్నాలే చేస్తోంది.