రూ. 140 కోట్లను ప్రజాధనంగా స్వాహా చేసిన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ మేనిఫెస్టో 99.9 శాతం ఎలా అమలు చేశామో చెప్పుకొచ్చారు. ఎలా అంటే… ఎందుకు అమలు చేయలేదో చెబుతున్నామని అంటున్నారు. అంటే ఎందుకు అమలు చేయలేదో చెప్పడం కూడా అమలు చేసినట్లేనన్నమాట. సజ్జల రామకృష్ణారెడ్డి.. వైసీపీ మేనిఫెస్టోలో అన్నీ అమలు చేశామని చెప్పే మాటలకు… చేతలకు పొంతన లేదు. అసలు హామీలు అమలు చేసిందే లేదు.
సీపీఎస్ ఎందుకు రద్దు చేయలేదంటే అవగాహన లేక హామీ ఇచ్చామని సలహాదారుడు చెప్పారు. మద్యనిషేధం ఓ కల అని తాజాగా సెలవిచ్చారు. ఆ రెండే కాదు..లెక్కలేన్ని హామీలు ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ దగ్గర నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు నిధుల వరకూ ఎన్నో హమీలు ఇచ్చారు. కానీ దేన్నీ అమలు చేయలేదు. 99.9 శాతం అమలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారు . అమలు చేయని వాటి సంగతేమిటంటే.. ఎందుకు అమలు చేయలేదో చెబుతామంటున్నారు.
నిజానికి మొదటి కేబినెట్ భేటీ తర్వాతే 80 శాతం హామీలు అమలు చేశామని ప్రచారం చేసేశారు. అప్పట్నుంచి అమలు చేశామని నమ్మించడమే టాస్క్ గా పెట్టుకున్నారు. ఎనన్నికల ముందు దాన్నో మిషన్ గా మార్చి పదే పదే చెబుతున్నారు. కానీ జగన్ రెడ్డి అమలు చేయని హామీలు చిన్నవి కాదు. మద్య నిషేదం చేసే ఓట్లు అడుగుతామని భారీ డైలాగులు కొట్టారు. వాటి సంగతి చెప్పాల్సి ఉంది. ఎందుకు చేయలేదో చెబుతామంటూ..కారణాలు వెదుక్కుని.. తాము ఏం చెప్పినా గుడ్డిగా ఓట్లేసే జనం ఉన్నారని ధైర్యం ప్రదర్శిస్తున్నారు.