హిందూపురంలో అధికార వైసీపీ పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. నేతల మధ్య వర్గ పోరాటానికి చెక్ పెట్టేందుకని ఇటీవలనే నియోజకవర్గ సమన్వయకర్తను మార్చారు. అయినా ఫలితం ఆశించిన మేరకు కనిపించకపోగా కొత్త వర్గం తెరపైకి వచ్చింది. కొత్త ఇంచార్జ్ ఏకంగా మున్సిపల్ చైర్మన్ ను అరెస్ట్ చేయించారు. ఆయనపై మాట్కా కేసులు నమోదు చేయించారు.
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ముందు నుంచి గ్రూపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ గ్రూపు రాజకీయాలకు చెక్‌పెట్టేందుకే 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవీన్ నిశ్చల్‌ను కాదని రిటైర్డు అధికారి మహమ్మద్ ఇక్బాల్‌ను పోటీలోకి దింపారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ వెంటనే వైసిపి అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ పదవినిచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్తగానూ నియమించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటూ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. అయితే స్థానిక నాయకులకు, ఈయనకు మధ్య పొసగలేదు. విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ గ్రూపు తగాదాల్లోనే రామకృష్ణారెడ్డి అనే హత్య జరిగింది. దీనిపై ఇక్బాల్పైనే ఆరోపణలు వెళ్లాయి. చివరికి ఆయనను తప్పింది దీపికను సమన్వయకర్తగా నియమించారు. ఈమె బిసి సామాజికవర్గానికి చెందినది అయిన్పటికీ భర్త రెడ్డి సామాజికవర్గం. ఈయన ద్వారా పార్టీలో సమన్వయం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాలేదు. దీంతో కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం ప్రారంభించారు. ఈ గ్రూపు గొడవలు టీడీపీ అభ్యర్థి బాలకృష్ణకు ఎప్పటికప్పుడు కలసి వస్తున్నాయి.