వినేవాడు గొర్రె అయితే చెప్పవాళ్లు వైసీపీ నేతలు, నీలి మీడియా అని ఊరకనే అంటారా ?. పక్క రాష్ట్రాల్లో ఎవరైనా పెట్టుబడి పెట్టి పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారని తెలియగానే అది ఏపీ నుంచి వెళ్లిపోతుందహో అని ప్రచారం చేసేస్తున్నారు. క్యాప్ జెమిని అసలు వైజాగ్ లో క్యాంపస్ ఏర్పాటు చేయాలనుకోలేదు. చెన్నైలో తమ ఆఫీసును మరో వెయ్యి కోట్లతో విస్తరించాలనుకుంది. అంతే… అది ఏపీకి వచ్చేదని.. విశాఖ నుంచి వెళ్లిపోయిందని బిగిన్ చేశారు. అసలు ఎప్పుడైనా జగన్ రెడ్డి ప్రభుత్వం క్యాప్ జెమినీని సంప్రదించిన దాఖలాలు ఉన్నాయా అంటే లేవు.. మరి ఎలా అంటే… అదంతే.
ఒక్క క్యాప్‌జెమినీ కాదు.. తెలంగాణలో లేదా తమిళనాడు ఇంకా కర్ణాటకలో అయినా సరే ఎవరైనా పెట్టుబడులు పెడితే ఏపీ నుంచే పోయానని ప్రచారం చేసేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకానికి లూలూ గ్రూప్ ఇచ్చిన ప్రకటన ఒక్కటి చాలు. భవిష్యత్ లో ఏపీలో పెట్టుబడులు పెట్టేదే లేదని వారు ప్రకటించారు. ఇప్పుడు చేసే నిర్వాకాలతో చంద్రబాబు గెలిచారని వచ్చే పెట్టుబడిదారులనూ వెళ్లగొట్టే కుట్ర చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఏపీపై వైసీపీ పగబట్టినట్లుగా వ్యవహరిస్తుంది. జగన్ హయాంలో పెట్టుబడుల్ని రానివ్వలేదు. గతంలో వచ్చిన వారిని వెళ్లగొట్టారు. పెట్టుబడులంటే… రాయలసీమలో వేల ఎకరాలు కట్టబెట్టేసి చేసే సంప్రదాయేతర ఇంధన విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు… అనుకుంటున్నారు. కంపెనీల్ని వ్యాపారాల్ని లాక్కోవడం అనుకుంటున్నారు. వీరి తీరు ఇలాగే ఉంటే.. ఏపీ వైపు రావడానికి ఇన్వెస్టర్లు కూడా భయపడాల్సిన పరిస్థితి .