లోకేష్ బయట ఏదైనా కార్యక్రమంలో కనిపించకపోతే వైసీపీ పెద్దలకు నిద్రపట్టేలా లేదు. ఆయన అంతర్గతంగా ఏం చేస్తున్నారోనని ఉగ్గబట్టుకోలేక టెన్షన్ తో సతమతమైపోతన్నట్లగా కనిపిస్తున్నారు. రెండు రోజులుగా లోకేష్ అంతర్గత సమావేశాల్లో బిజీగా ఉన్నారు. అంతే వైసీపీకి కంగారు ప్రారంభమయింది. ఎవరితో చర్చలు జరుపుతున్నారు… ఎందుకోసం అనేది తెలుసుకోవడానికి తంటాలు పడ్డారు. చివరికి ఆయనపై రూమర్ ప్రచారంలోకి తెచ్చారు.
లోకేష్ అమెరికాకు వెళ్లారని అక్కడ ఆయనను అరెస్టు చేశారని ఓ పనికి మాలిన ఎడిట్ ను తీసుకు వచ్చి ప్రారంభించారు. లోకేష్ అమెరికాకు వెళ్తే ఎవరికీ తెలియదా?. పోనీ అక్కడ పోలీసులు పట్టుకుంటే.. ఎవరికీ తెలియదా ?. ఇంత చిన్న లాజిక్ ను కూడా పట్టించుకోకుండా ప్రచారం చేశారు. తాము ఫేక్ చేస్తున్నామని.. తమను తేడాగా చూస్తారని తెలిసినా వారు తొందరపడ్డారు. ఎందుకంటే వారి లక్ష్యం.. లోకేష్ ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో తెలుసుకోవడం. వారి ఆతృతను నిజం చేస్తూ.. కొన్ని షాకులతో ఫోటోలు రిలీజ్ చేశారు లోకేష్. గుంటూరు వైసీపీ నేత.. జగన్ రెడ్డికి మిత్రుడని ప్రచారంలో ఉన్న బీమనాథం భరత్ రెడ్డి లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన సిమ్స్ కాలేజీలు నడుపుతూ.. ఓ రకమైన లైఫ్ స్టైల్ మెయిన్ టెయిన్ చేస్తూ యువతను ఆకట్టుకుంటారు. ఆయన లోకేష్ కలవడంతో వైసీపీ ఫ్యూజులు ఎగిరిపోయాయి.
లోకేష్ ఇలాంటివేవో చేస్తున్నాడని తెలుసుకునేందుకే వైసీపీ ఆ తరహా ప్రచారం చేస్తోందని.. సోషల్ మీడియాకు అర్థమైపోయింది. నారా లోకేష్ .. చంద్రబాబు అరెస్టు సమయంలో ఢిల్లీలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన చేసిన రాజకీయంతో వైసీపీ పరిస్థితి తలకిందులు అయిపోయింది. అప్పట్నుంచి లోకేష్ రెండు రోజులు కనిపించకపోతే కిందామీదా అయిపోతున్నారు.. వైసీపీ నేతలు. ఆయన ఎక్కడున్నారో తెలుసుకునేందుకు ఫేక్ న్యూస్ వదులుతున్నారు.