భారత్ లో కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని నెదర్లాండ్స్ చెప్పిందంటూ వైసీపీ ట్విట్టర్ అకౌంట్లు మరోసారి విషం చిమ్మడం ప్రారంభించాయి. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో ఈ ఆంక్షలు ఉన్నాయని అత్యవసరమైతే తప్ప ఏపీకి పోవద్దని చెప్పినట్లుగా ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు నిజం మాత్రం వేరే. ఎక్కడెక్కడో వెదుక్కుని కావాలని ఏపీపై బురదచల్లి వచ్చే పెట్టుబడులు రాకుండా చేయాలన్న పన్నాగంతో కోట్లు ఖర్చు పెట్టి పెట్టీ మరీ ఈ ప్రచారం చేస్తున్నారు.
నెదర్లాండ్స్ ట్రావెల్ అడ్వయిజరీ ఏం చెప్పింది ?
నెదర్లాండ్స్ ప్రపంచ దేశాలకు వెళ్లే తమ పౌరుల కోసం ఓ ట్రావెల్ అడ్వయిజరీని ప్రకటిస్తూ ఉంటుంది. ఇండియాకు వెళ్లే వారి కోసం.. కూడా ఇలా ఓ ట్రావెల్ అడ్వయిజరీని ప్రకటించింది. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలు. అంత సేఫ్ కాదనుకున్న ప్రాంతాల గురించి ప్రకటిస్తూ ఉంటుంది. ఇలా గత ఏడాదిలోనే ఓ లిస్ట్ పెట్టింది. తాజాగా అప్ డేట్ చేసింది. అందులో ఏపీకి వెళ్లొద్దని ఎక్కడా లేదు. అన్ని ప్రాంతాలకు నిరభ్యంతరంగా పోవచ్చని తెలిపింది. కానీ మ్యాప్‌లో మార్క్ చేసిన కొంత భాగంలో మాత్రం అత్యవసరం అయితే పర్యటించండి అని తెలిపింది.
Read Also : యూట్యూబర్లకు విచ్చలవిడి స్వేచ్చ కూడా ప్రమాదమే !
నక్సల్ ప్రభావితంగా కేంద్రం గుర్తించిన ప్రాంతాలు అవి !
ఏపీలో తమ పౌరులు అత్యవసరం అయితేనే వెళ్లండి అని చెప్పిన ప్రాంతాలు .. పూర్తిగా అటవీ ప్రాంతాలు. ఏవోబీ, మన్యం వంటి ప్రాంతాలు. వాటిని కేంద్రం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఎప్పుడో గుర్తించింది. ఆ పేరుతో ఇచ్చే నిధులను జగన్ ప్రభుత్వం కూడా తీసుకుంది. నక్సల్స్ కర్యకలాపాలు లేవని నివేదికలు ఇస్తూంటారు కానీ.. కేంద్రం ఆ విధంగా గుర్తించి జాబితా నుంచి తొలగిస్తేనే నెదర్లాండ్స్ ఆ అడ్వయిజరీని కూడా తీసేస్తుంది.
ఫేక్ న్యూస్‌తో దాడి చేస్తున్న వైసీపీ మూకలు
ఏపీపై వైసీపీ మూకలు ప్రత్యేకమైన టీములుగా ఏర్పడి సోషల్ మీడియాలో భయంకరమైన దాడి చేస్తున్నాయి. ఐదేళ్ల పాటు చేసిన విశృంఖల దాడుల నుంచిప్రజలు రక్షణ కోరుకున్నారు. అయినా తాము వదిలేదే లేదని వెంటబడుతున్నారు.