నిన్ను నువ్వు మోసం చేసుకుంటే సంకనాకిపోతావ్ అని ఓ సినిమాలో హీరో అంటాడు. ఇప్పుడు వైసీపీ అదే చేస్తోంది. ప్రజల్ని మోసం చేస్తున్నానని అనుకుని తనను తాను మోసం చేసుకుంటోంది. ఐదేళ్ల పరిపాలనపై ఒక్క నిజం చెప్పడం లేదు సరి కదా… ఎన్నికలకు ముందు ప్రతి విషయాన్ని ఫేక్ చేస్తూ.. దాన్నే సర్క్యూలేట్ చేస్తూ బతికేస్తోంది. ఇవన్నీ ఎవర్ని నమ్మిస్తాయంటే.. సామాన్య జనాలు.. కాస్త తెలివి ఉన్న వాళ్లు ఎప్పుడో నమ్మడం మానేశారు. వైసీపీ కార్యకర్తలు కూడా నమ్ముతున్నారో లేదో తెలియదు. చూస్తే ఇట్టే ఫేక్ అని తెలిసిపోయేలా చేయడమే వారి స్టైల్.
నిజంగా చేసే సర్వేల్లో మెజార్టీ రావడం లేదు అందుకే పెయిడ్ సర్వేలను వైసీపీ నమ్ముకుంది. అవి కాదు.. ఊరూపేరు లేని కంపెనీల పేర్లతో చేసే పోస్టర్ సర్వేలు లెక్కలేనన్ని వస్తున్నాయి. వీటితో పాటు ప్రముఖ మీడియా సంస్థల పేరుతో సర్వేలంటూ ఫేక్ చేసి వదలుతున్నారు. పరువు పోగొట్టుకున్నారు. ఏబీపీ – సీఓటర్ పేరుతో రిలీజ్ చేసిన ఓ పోస్టర్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నిజమైన సర్వే చానల్లో లైవ్లో వచ్చే సరికి సొంత పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిపోయంది. రిపబ్లిక్ అని.. ఎన్డీటీవీ అని అలా.. వరుసగా సర్వేలు ప్రకటించుకుంటూనే ఉన్నారు. కానీ ఎవరూ నమ్మడం లేదు. తాజాగా కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో పేరుతో ఫేక్ చేశారు. ఇవి చూసి.. వైసీపీ కార్యకర్తలకే.. ఇంత ఫేక్ ఎలారా నమ్మేది అని ఫీలవ్వాల్సి వచ్చింది.
వైసీపీ ఓడిపోవడం ఖాయమని ప్రజల్లో అభిప్రాయం బలపడటంతో.. తాము పుంజుకున్నామని చెప్పుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందు కోసం వారు పూర్తిగా ఫేక్ వార్తల్నే నమ్ముకుంటున్నారు. ప్రజల్ని తక్కువ అంచనా వేస్తూ… తాము చెప్పే ప్రతి మాటా నమ్ముతారన్నట్లుగా వారి వ్యవహారశైలి ఉంది. ఇలాంటి ఫేక్ వార్తల వల్ల చివరికి వైసీపీ నేతలు చెప్పినా నమ్మలేని పరిస్థఇతి ఏర్పడింది.
ఫేక్ పునాదుల మీద ఏర్పడిన పార్టీ.. అదే ఫేక్ వార్తలు..ప్రచారాలతో గత ఎన్నికల్లో లబ్దిపొందింది. ఈ సారి కూడా అదే ప్రయత్నం చేస్తోంది. కానీ ప్రజల్లో చైతన్యం కనిపిస్తోంది. వైసీపీ ఇంకా ఏదో మాయా ప్రపంచంలో బతికేస్తోందని.. బయటకు రావాలంటే.. ఎన్నికల ఫలితాలు రావాల్సిందేనని సెటైర్లు వినిపిస్తున్నాయి.