వైసీపీలో ఫ్యామిలీ ప్యాకేజీలు ఇస్తున్నారు సీఎం జగన్. టిక్కెట్ల కోసం అడగాల్సిన పని లేదు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. టిక్కెట్ ప్రకటించేస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ భార్యకు విశాఖ ఎంపీ టిక్కెట్ ప్రకటించారు. అంతకు రెండు రోజుల ముందే మీడియా బొత్సను ఈ అంశంపై ప్రశ్నించింది . దాంతో ఆయన ఆశ్చర్యపోయి నిజమా.. ఈ నిషయం నాతో ఎవరూ మాట్లాడలేదే అన్నారు. రెండు రోజుల తర్వాత ఆయనే తన భార్యను విశాఖ సమన్వయకర్తగా నియమిస్తున్నట్లుగా ప్రకటన చేయాల్సి వచ్చింది.
బొత్స ఫ్యామిలీ నుంచి ఈ సారి ఐదారుగురు అభ్యర్థులుగా ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. బొత్స, ఆయన సోదరులు ఇద్దరు, ఆయన మేనల్లుడు, భార్యకు టిక్కెట్లు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. గత కొంత కాలంగా ఆయన తన కుమారుడి కోసం పట్టుబడుతున్నారు.బహుశా చీపురుపల్లి నుంచి తాను వైదొలిగి చివరికి తన కుమారుడ్ని నిలబెడతారమో చూడాల్సి ఉంది. ఒక్క బొత్స కాదు.. మంత్రి పెద్దిరెడ్డికి కూడా ఫ్యామిలీ ప్యాకేజీ ప్రకటించారు. బలిజలకు ఎప్పుడ కేటాయించే రాజంపేట పూర్తిగా వారి కుటుంబం అధీనంలోకి పోయింది. నగరి, రిజర్వుడు నియోజకవర్గాల్లో తప్ప అంతా పెద్దిరెడ్డి బంధుమిత్రులే రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరులు నలుగురు ఎమ్మెల్యేలు. ఈ సారి వారంతా తమతో పాటు వారసులకూ టిక్కెట్లకు ప్రయత్నిస్తున్నారు.
మంత్రి ఆదిమూలం సురేష్ తో పాటు ఆయన సోదరుడికీ టిక్కెట్ ప్రకటించారు. ఇక జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇలా చూసుకుంటే పోతే వైసీపీలో నాలుగైదు ఫ్యామిలీలు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయడానికి సింహభాగంసీట్లు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన చోట్ల వారి అనుచరులకు సీట్లు ఇప్పించుకుంటారు. వైసీపీ ఇలా కుటుంబపార్టీగా మారిపోవడడం గతంలో జగన్ చెప్పిన కుటుంబంలో ఒక్కరికే టిక్కెట్ అనే సూక్తికి విరుద్దంగా కనిపిస్తోంది. అభ్యర్థులు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి అనే సెటైర్లు సహజంగానే వస్తున్నాయి.