ప్రచారం ముగిసిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా ఓవర్ టైం వర్క్ చేసింది. చంద్రబాబు ఫేక్ వీడియోలు పెట్టుకుని గంటకొకటి చొప్పున రిలీజ్ చేస్తూ పోయింది. ఓ సారి రిజర్వేషన్ల మీద..మరోసారి పథకాల మీద.. మరోసారి ఇంకో టాపిక్ మీద.. అవి చూస్తే.. చిన్న పిల్ల వాడికి కూడా ఫేక్ అని తెలిసిపోతుంది. కానీ తాము ఏది చెప్పినా జనం నమ్మేస్తారన్న భ్రమలో ఉన్న వైసీపీ నేతలకు మాత్రం ఈ ఫేక్ ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో రన్ చేశారు.
గెలుపుపై ఎలాంటి ఆశలు లేకపోవడంతో చివరి క్షణంలో ఏదో ఒకటి చేద్దామని ఈ ప్రయత్నం. నిజానికి ముస్లింలలోనూ ఈ సారి మార్పు ఉందన్న ప్రచారం జరుగుతూండటంతో.. వైసీపీలో కంగారు ప్రారంభమయింది. తమ ఓటు బ్యాంక్ ఎక్కడ దెబ్బతింటుందోనని.. ఇటీవల జగన్ ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడటం ప్రారంభించారు. చంద్రబాబు ఆ రిజర్వేషన్లను కాపాడుతామని .. వాటి జోలికి ఎవరూ రారని భరోసా ఇచ్చారు. కానీ వైసీపీ మాత్రం ఫేక్ను కంటిన్యూ చేసింది. తమ ఓటు బ్యాంక్ పక్క పార్టీకి పోతుందని అంత నమ్మకం ఏమిటో ఆ పార్టీ కార్యకర్తలకూ అర్థం కాలేదు.
పథకాల విషయంలోనూ అంతే. అమరావతినే కడతానని.. ఊహించనిస్థాయిలో రిటర్న్స్ ఉంటాయని పథకాల గురించి పట్టించుకోనని అన్నట్లుగా మరో ఆడియో వైరల్ చేశారు. ఆ ఆడియో వింటే చంద్రబాబు వాయిస్ ను ఇంత కంటే మెరుగ్గా మిమిక్రి చేసే వాళ్లు ఉంటారు కదా అన్న సెటైర్లు పడ్డాయి. నమ్మే వాళ్లు ఉంటారు కదా అని చెలరేగిపోయారు. ఈ ఫేకులన్నింటిపై ఫిర్యాదులు పోలీసులు వెళ్లాయి.
అయితే ఈ ఫేక్ ల విప్లవం చూసి వైసీపీ నిజంగా ఊహించిన దాని కన్నా ఘోరమైన పరిస్థితుల్లో ఉందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో పెరిగిపోయింది. మీదపడిపోయిన ఓటమిని ఈ ఫేక్ లతో తప్పించుకోగలరా అన్న చర్చ నడుస్తోంది.