రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ నేతలు చేసిన దాడి యాధృచ్చికం కాదు. ఖచ్చితంగా కావాలని చేశారు. ఇది జగన్ రెడ్డి అండ్ కో రాజకీయ వ్యూహాల గురించి తెలిసిన వారందరికీ స్పష్టత ఉంటుంది. సభల్లో చంద్రబాబు, పవన్ లతో పాటు రాహుల్, మోడీల ఫోటోలు పెట్టి పంచ్‌లు ఇవ్వాలని..చెప్పులతో కొట్టాలని రెచ్చగొట్టినప్పుడే అసలు వ్యూహం అర్థమైపోతుంది. జగన్ రెడ్డి సైకో మనస్థత్వం అంచనా వేయలేనంత స్థాయిలో ఉంటుందని టీడీపీ నేతలు అంటూ ఉంటారు. ఎన్నికలను ఆయన పీస్ ఫలు గా ఉండాలని కోరుకోవడం లేదు.
అందుకే మొదటి నుంచి రెచ్చగొట్టుడు ప్రారంభించారు. యుద్ధానికి సిద్ధమన్నారు.. తర్వాత చొక్కా మడత పెట్టాలన్నారు. అంటే దాడులు చేయాలనే. ఈ దిశగా యాక్షన్ లోకి దిగాలని.. రాప్తాడు సభలో ప్రణాళిక ప్రకారం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ను టార్గెట్ చేసుకున్నారు. వీడియో తీసింది కూడా వైసీపీ వాళ్లే. సర్క్యూలేట్ చేసింది కూడా వైసీపీ వాళ్లే. అంటే… జగన్ రెడ్డి ప్రచారం చేసే… మీడియా సిబ్బందిపై దాడులు చేయాలని సంకేతాలు ఇచ్చారన్నమాట. తర్వాత టీడీపీ నేతలపై చేస్తారు. ఇదంతా వ్యూహం ప్రకారం ఎన్నికల ప్రక్రియను శాసించేందుకు చేస్తున్న ప్రయత్నాలు.
జగన్ రెడ్డి నంగి నంగిగా మాట్లాడతారు కావొచ్చు కానీ ఆయన క్రిమినల్ మైండ్ సెట్ అంచనా వేయలేని విధంగా ఉంటుందని.. పోలీసులు, వ్యవస్థలు చేతుల్లో ఉన్నప్పుడు దేనికైనా తెగిస్తారని టీడీపీ నేతలు చాలా ఉాదాహరణలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు జర్నలిస్టుపై దాడి విషయంలోనూ అదే కనిపిస్తోంది. వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేసి అరాచకశక్తుల్ని అణిచివేయకపోతే.. రాష్ట్రం రావణకాష్టం అవుతుంది. సమస్యాత్మక ఎన్నికల ప్రాంతం అవుతుంది.