లోకేష్ పాదయాత్రకు టీడీపీ నేతలు పబ్లిసిటీపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కొంత మంది సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం కొంతపని చేస్తున్నారు. పాదయాత్ర ఉన్న గ్రామాల్లో ప్రజల్ని వ్యక్తిగతంగా పలకరించి కష్టసుఖాలు తెలుసుకుని భరోసా ఇవ్వడమే లక్ష్యంగా పాదయాత్రకు పెట్టుకున్నారు. అయితే వైసీపీ సోషల్ మీడియా మాత్రం లోకేష్ పాదయాత్రకు విస్తృతమైన కవరేజీ ఇస్తోంది. సాదారణంగా ఆ పార్టీ సోషల్ మీడియా పాజిటివ్ ఇస్తుందని ఎవరూ అనుకోరు. నెగెటివ్ గానే ఇస్తారు. ఎలా అయినా పాదయాత్రను ప్రచారంలో ఉంచడంలో వైసీపీ సోషల్ మీడియా ఎంతో సహకరిస్తోంది.
విచిత్రంగా దొరికిపోయే ఫేక్ ఫోటోలు, వీడియోలతో వీరు హడావుడి చేస్తున్నారు. ఏడెనిమిది నెలల కిందట బైక్ ర్యాలీలో పాల్గొన్న ఫోటోలు తెచ్చి.. పాదయాత్ర బైక్ యాత్ర అయిందని ప్రచారం చేస్తారు. కొంత మంది సెలబ్రిటీ అకౌంట్లను మాట్లాడుకుని… ఎక్కడో పదో అంతస్తు నుంచి పెద్దగా జనం లేని ఫోటోను పెట్టి ఇక్కడ లోకేష్ ఉన్నారా అని ప్రశ్నిస్తారు. ఇలాంటి విన్యాసాలు చేస్తూ.. సోషల్ మీడియాలో లోకేష్ పాదయాత్రపై చర్చ జరిగేలా చేస్తున్నారు. ఇలాంటివి చేసినప్పుడు సహజంగానే వాస్తవాలను టీడీపీ కార్యకర్తలు బయట పెడుతూంటారు. కామెంట్స్ అవే ఎక్కువ ఉంటాయి దీంతో వారు అబద్దం చెబుతున్నారని.. తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం స్పష్టమవుతుంది. వైసీపీ మీడియాలోనే అందిరకీ అసలు విషయం అర్థమవుతోంది.
లోకేష్ పాదయాత్రకు స్పందన లేకపోతే… చిన్న చిన్న గ్రామాల్లోనూ.. మాట్లాడేందుకు లోకేష్ ను ఎందుకు అడ్డుకుంటున్నారన్న చర్చ అందరిలో జరుగుతోంది. నారా లోకేష్ పాదయాత్రలో మాట్లాడే మాటలపై ట్రోలింగ్ వీడియోలు చేయడానికి, మార్ఫింగ్ ఫోటోలు చేయడానికి ట్రెండింగ్ లు చేయడానికి వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ పన్నెండు వందల మందిని హైర్ చేసుకున్నారని చెబుతున్నారు. అయితే వీరి స్ట్రాటజీలు లోకేష్ కు హైప్ క్రియేట్ చేస్తూండటం ఆ పార్టీల్లో గుసగుసలకు కారణం అవుతోంది.