అభ్యర్ధుల ప్రకటనతోనే వైసీపీ ఎలాంటి పార్టీనో అర్ధమవుతోందని, అత్యధికంగా నేరస్తులకు వైఎస్ఆర్సిపిి టికెట్లు ఇచ్చిందని ముఖ్యమంత్రిి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. చంద్ర బాబు మాట్లాడుతూ, అటు, ఇటు నేరగాళ్లతో కూర్చుని జగన్ అభ్యర్ధుల ప్రకటన చేశారని అన్నారు. పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు నందిగం సురేష్, మరోవైపు ధర్మాన ప్రసాదరావు.. మధ్యలో 12 చార్జిషీట్లలో ఏ1 నిందితుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటూ చంద్రబాబు, వైఎస్ఆర్సిపి అభ్యర్థులను ప్రకటించిన విధానాన్ని ఎద్దేవా చేశారు.
అప్పట్లో రాజధాని కోసం భూసేకరణ చేసే సమయంలో, ఉద్దండరాయునిపాలెం లో రైతుల అరటి తోటలు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. అయితే ఆ తర్వాత, రాజధాని కి భూములు ఇవ్వని రైతుల తోటలను మంత్రి నారాయణ తగలబెట్టిస్తున్నాడంటూ కొంతమంది పనిగట్టుకొని ప్రచారం చేశారు. కానీ తీరా దర్యాప్తు తర్వాత, నందిగాం సురేష్ అనే వైఎస్ఆర్ సీపీ నేత ఇందులో నిందితుడిగా తేలాడు. ఇప్పుడు ఆ సురేష్ ని పక్కన పెట్టుకొని జగన్ అభ్యర్థులు ప్రకటించడాన్ని చంద్రబాబు విమర్శించారు.
అభ్యర్థుల ప్రకటన సమయంలో జగన్ కి ఒకవైపు కూర్చున్నది ఉద్దండరాయునిపాలెం లో అరటి తోటలు తగులపెట్టిన కేసుల్లో నిందితుడు అయినటువంటి నందిగాం సురేష్ అయితే, అభ్యర్థులను ప్రకటించింది కన్నెధార గ్రానైట్ కొండలు తవ్వేసిన నిందితుడు ధర్మాన అని, అసలు ఇది అభ్యర్ధుల ప్రకటనా..? లేక నేరగాళ్ల ప్రకటనా..? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ఎన్నికల్లో సైబర్ నేరగాళ్ల అరాచకం పెరిగిందని, సైబర్ నేరగాళ్లంతా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారని, నేరగాళ్ల కేరాఫ్ అడ్రస్ గా వైకాపా మారిందని చంద్రబాాబు తీవ్ర విమర్శలు చేశారు.
చంద్రబాబు విమర్శలు చేసిన ధర్మాన, సురేష్ లతోపాటు ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన గేదెల శీను లాంటి పలువురు కొత్త నేతలకి సైతం విదేశాలలో కేసులు నమోదు అయి ఉన్న విషయం తెలిసిందే.