స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తొలగింపు వ్యవహారంలో అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేస్తామని సమయం తీసుకున్న ఏపీ సర్కార్… గడువులోగా ఆ పని చేసింది. కానీ దాదాపుగా అన్నీ మొదటి అఫిడవిట్లో ఉన్న విషయాలనే పునరుద్ఘాటించంది కానీ.. కొత్త విషయాలేం చెప్పలేదు. ఎన్నికల సంస్కరణల కోసమే… ఎస్ఈసీ పదవిని రిటైర్డ్ జడ్డి అర్హత మార్చామని ఏపీ సర్కార్ చెప్పింది. దీనిపై .. రమేష్ కుమార్..తన వాదన గట్టిగా వినిపించారు. ఏ నిపుణలు కమిటీని…ఎవరితో చర్చలు జరిపి.. ఏ నివేదికల ప్రకారం..ఈ సంస్కరణలు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. కుట్ర పూరితంగా తనను తీసేయడానికి ఏలా చేస్తున్నారని వాదించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కొంత అడిషనల్ సమాచారాన్ని ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపామని చెప్పుకొచ్చింది.
ఆ సంప్రదింపులు ఏమిటో.. స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా.. మార్చుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం సలహా ఇచ్చిందో లేదో మాత్రం..అఫిడవిట్లో చెప్పలేదు. సంప్రదించామని మాత్రం చెప్పారు. ఈ విషయం విచారణలో తెలిపే అవకాశం ఉంది. ఈ మాత్రం దానికి అడిషనల్ అఫిడవిట్ వేస్తామని ఎందుకు సమయం తీసుకున్నారన్నది చాలా మందికి అర్థం కాని విషయం. కానీ వైసీపీ సర్కార్.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఓ స్పష్టమైన నమ్మకంతో ఉంది. అదేమిటంటే.. ఆయన ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని.. ఎన్నికల వాయిదా నిర్ణయం దగ్గర్నుంచి.. కేంద్రానికి రాసిన లేఖ వరకూ.. అన్నీ ఆయన చెప్పినట్లే చేస్తున్నారని.. నమ్ముతున్నారు.
కేంద్రానికి రాసిన లేఖ టీడీపీ నేతల దగ్గర్నుంచే వచ్చిందని.. అసలు ఆ లేఖను.. టీడీపీ నేతలే పంపారని చెప్పి.. విచారణ కూడా చేయించారు. అందులో సంచలన విషయాలు బయటపడితే.. ఆ విషయాన్ని అడిషనల్ అఫిడవిట్లో చెప్పాలనుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే సీఐడీ విచారణలో పెద్దగా వివరాలు వెల్లడికాలేదు. రమేష్ కుమార్ అడిషనల్ పీఎస్‌గా పని చేసిన సాంబమూర్తి.. ఆ లెటర్ ను… రమేష్ కుమారే డ్రాఫ్ట్ చేశారని.. తాను కంపోజ్ చేశానని వాంగ్మూలం ఇవ్వడంతో… మొత్తం అడ్డం తిరిగినట్లయింది. దీంతో పాత సమాచారంతోనే.. అఫిడవిట్ దాఖల చేశారని భావిస్తున్నారు.