స్టోరీ రాస్తే ఇట్టే పట్టేయాలి… స్క్రీన్ ప్లే పట్టరా పట్టు అన్నట్లుగా ఉండాలి. కలెక్షన్లు వస్తాయా రావా అన్నది కాదు ఒక్క సారే జాక్ పాట్ కొట్టేయాలన్నట్లుగా స్కెచ్ ఉండాలి… అన్నీ కలిస్తేనే మహి వి రాఘవ. మొదటి యాత్రకు దర్శకుడు.. అంతిమ యాత్రకు నిర్మాత, దర్శకుడు కూడా. ఎందుకంటే ఆయన సీఎం జగన్ రెడ్డిని పొగిడేందుకు ఎలివేషన్లు ఇచ్చేందుకు .. ప్రతిపక్ష నాయకుల్ని తప్పుగా చూపించేందుకు కోట్లు పెట్టి సినిమా తీశారు. కలెక్షన్లు వస్తాయని ఆయన కూడా అనుకోలేదు. అందుకే ప్రతిఫలంగా ప్రభుత్వం వద్ద భూమిని కొట్టేస్తున్నారు. దానికి సంబంధించిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రజ్యోతి పత్రిక ఆధారాలతో సహా అన్నీ ప్రచురించింది.
“హార్సిలీహిల్స్‌లో మినీ స్టూడియో” స్టోరీ టెల్లింగ్ అదుర్స్ !
మహి వి రాఘవ స్టోరీ టెల్లింగ్‌లో ఎక్స్ పర్ట్. సినిమాల్లో ఆయన చెప్పే స్టోరీల గురించి చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేయవచ్చు కానీ.. బయట ఆయన చెబుతున్న కథలు మాత్రం మైండ్ బ్లాకింగే. అదేమిటంటే… హార్సిలీ హిల్స్‌లో మినీ స్టూడియో కట్టేస్తానని భూమి కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. అదీ కూడా ఎప్పుడు అంటే.. తాను యాత్ర 2ను ప్రారంభించే ముందు. అక్కడే అసలు కథ అర్థమవుతుంది., ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది… తన కథను క్లైమాక్స్‌కు తెచ్చారు. భూమిని సొంతం చేసుకోబోతున్నారు. పనికి మాలిన నాలుగు సినిమాలు తీసి తన బాక్సాఫీస్ పొటెన్షియాలిటీని ఇంత వరకూ నిరూపించుకోలేకపోయిన ఆయన ఏకంగా స్టూడియో కట్టేస్తానని ప్రభుత్వానికి స్టోరీ చెప్పడం.. ఆ స్టోరీ ప్రభుత్వానికి నచ్చడం వెంటనే భూమి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం.. అంటే ఆయన కథలు చెప్పే విధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
మైండ్ బ్లోయింగ్ మార్కెటింగ్ ఎక్స్ పర్ట్ !
మహి వి రాఘవ తన సినిమాలను మార్కెట్ చేసుకోవడంలో… మామూలు ఎక్స్ పర్ట్ కాదు. తన సినిమాలను ఎవరూ చూడరు. డబ్బులు పెట్టి టిక్కెట్లు కొని ఎవరూ చూడరు. ఆ సంగతి ఆయనకు తెలుసు. అందుకే మార్కెటింగ్‌లో తన సహజ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. తానే యాత్ర 2 సినిమాను నిర్మించి దానికి తగ్గ ప్రతిఫలాన్ని భూముల రూపంలో పొందాలని స్కెచ్ వేశారు. దానికి తగ్గట్లుగా మార్కెట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు హార్సిలీ హిల్స్‌లో రెండు ఎకరాలు రేపో మాపో ఖాతాలో పడతాయి. తర్వాత మరికొన్ని ఎకరాలు. అక్కడ మినీ స్టూడియో కడతారో… మంచి హోటల్ కట్టి లైఫ్ సెటిల్ చేసుకుంటారో కానీ.. ఆయన మాత్రం … తన డబ్బులతో సినిమా తీసి ప్రజా ఆస్తుల్ని తన పేర రాయించేసుకుంటున్నారు. ఇంత కన్నా మార్కెటింగ్ ఇంకెవరికైనా సాధ్యమవుతుందా ?
పొలిటికల్ సినిమాలకు ప్రత్యేక పర్పస్ అంటే క్విడ్ ప్రో కో చేయడమా ?
రాజకీయ సినిమాలకు ప్రత్యేకమైన పర్పస్ ఉంటుందని.. మహి వి రాఘవ చెబుతూ ఉంటారు. అదేమిటంటే… ఆ రాజకీయ నాయకుడికి అనుకూలంగా సినిమా తీసి.. ప్రజా ఆస్తుల్ని కొట్టేయడమని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆదాయం రాదని ఆయనకూ తెలుసు. మరి ఎందుకు ఆయనే నిర్మాతగా వ్యవహరించారు.. ఇక్కడే అసలు కిటుకు ఉంది. సొంత డబ్బులు పెట్టి జగన్ రెడ్డికి ప్రచారం చేసి.. ప్రభుత్వ ఆస్తుల్ని తన పేర రాయించుకునే క్విడ్ ప్రో కోకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారు మహి వి రాఘవ.