అమరావతిపై చివరి వరకు విషం కక్కేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. రాజధాని ప్రాంత రైతుల్లో అనుమానాలు నెలకొనేలా అపోహలు సృష్టిస్తోంది. అమరావతికి ఓ రూపు వస్తే రాజధాని నిర్మాతగా చంద్రబాబు, అడ్డంకులు సృష్టించినట్లుగా వైసీపీ చరిత్రలో నిలిచిపోవడం తథ్యం. అందుకే చివరివరకు విషం కక్కేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. మోడీ అమరావతి పర్యటన నేపథ్యంలో రాజధాని రైతుల్లో అలజడి రేపేందుకు స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది.
రాజధాని ప్రాంత సమీపంలో మరో 30వేల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం బయటకు రాగానే వైసీపీకి.. అమరావతి నిర్మాణాలకు బ్రేకులు వేసేందుకు ఓ అస్త్రం దొరికినట్లేనని సంబరం పడినట్లు ఉంది. ఇంకేముంది.. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా.. మరో 30 వేల ఎకరాలు తీసుకునేందుకు రెడీ అయ్యారని ప్రచారం ప్రారంభించింది.కొంతమంది రైతులను సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేశారు.
ఈ ప్రయత్నం వెనక వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు. త్వరలోనే ప్రధాని పర్యటన ఖరారు అవుతుందని అంచనా వేసి.. రైతుల్లో లేనిపోని అపోహలు సృష్టించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇదంతా ఎందుకంటే అమరావతికి అడ్డంకులు సృష్టించేందుకు కుట్ర రాజకీయం అని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆందోళనలు చేస్తే, అది అమరావతి నిర్మాణాలపై ప్రభావం చూపుతుందనేది వైసీపీ హిడెన్ ఎజెండాగా చెబుతున్నారు.
మే2న ప్రధాని పర్యటనలోపు రాజధాని ప్రాంత రైతుల్లో అపోహలు సృష్టించాలని సోషల్ మీడియాలో వైసీపీ విస్తృత ప్రచారం చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కానీ, వైసీపీకి ఇలాంటివి అక్కర్లేదు.. అలజడి రేపడమే వారి ఎజెండా..అమరావతిని అడ్డుకోవడం ధ్యేయం. ఇంకా ఏం చేస్తారో !వారి పట్ల మోడీ ఎలా వ్యవహరిస్తారో చూడాలి