ఎన్నికల్లో ఏ అంశంతో వెళ్లాలన్నదానిపై వైసీపీలో అంతర్మథనం చోటు చేసుకుంటోంది. మూడు రాజధానుల అంశంపై ఉద్యమాలు ప్రారంభిస్తోంది. అయితే ఇలా చేయడం వల్ల సంక్షేమం వెనక్కి పోతోందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. సంక్షేమం ఎజెండాగా ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అందుకే గడప గడపకూ వెళ్లి.. ఒక్కో కుటుంబానికి ఎంత సాయం చేశామో చెబుతున్నారు. ఇన్ని వేలు.. లక్షలు ఇచ్చాం కాబట్టి ఓటు వేయాలని గట్టిగా చెప్పి వస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ సంక్షేమం పక్కకుపోయి మూడు రాజధానులు తెరపైకి వచ్చింది. దానికి వైసీపీ నేతల వ్యూహమే కారణం.
మూడు రాజధానులు గెలిపించదంటున్న సజ్జల
మూడు రాజధానులు ఎన్నికల అజెండాగా .. గెలిపించే అంశంగా చూడటం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. ఈ విషయంలో వారికి కాస్త స్పష్టత ఉందనుకోవచ్చు. మూడు రాజదానులు అనే అంశం తెరపైకి వస్తే.. ఐదేళ్ల పాలన తర్వాత జగన్ కట్టగలరా అనే ప్రశ్న వస్తుంది. రాజధాని అంటే.. ప్రజల మనసుల్లో అమరావతి తరహాలో పెద్ద ఎత్తున నిర్మాణాలనే భావన ఉంది. అవి కట్టాలంటే లక్షల కోట్లు అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి మూడు ఎలా కడతారని ప్రజల్లో సందేహం ఉంది. మూడు రాజధానుల ఉద్యమంతో పాటు అది పెరుగుతుంది. ప్రజలను సంతృప్రి పరిచేలా ఎలా చేయాలన్న డౌట్ వారిని వేధిస్తోంది.
సంక్షేమంతోనే ప్రజ్లలోకి వెళ్లాలనుకుంటున్న జగన్
అదే సమయంలో సీఎం జగన్ సంక్షేమమే ఎజెండా కావాలని నమ్ముతున్నారు. ప్రతీ గ్రామంలో మెజార్టీ ఓటర్లకు.. లెక్క చూసుకుని మరీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని.. వారంతా ఓట్లు వేస్తే తిరుగు ఉండదని ఆయన నమ్ముతున్నారు. రాజధాని అంశం, పోలవరం అంశాలు, తెర మీద కనిపిస్తున్నా ఎన్నికల్లో వీటి ప్రభావం తక్కువగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. దీంతో సంక్షేమం పైనే జగన్ సర్కార్ మెదటి నుండి ఆదారపడి,ఇ చ్చిన హామిలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో రోడ్లు కూడ బాగు చేయలేని పరిస్దితుల్లో జగన్ ప్రభుత్వం పాలన సాగిస్తుందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే వీటిని కూడ జగన్ అంతగా పట్టించుకోవటం లేదు.
పీకే సర్వేలోనూ సంక్షేమంపైనే ఫీడ్ బ్యాక్ !
ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలపై కూడా జగన్ దృష్టి పెట్టారు. విపక్ష పార్టీలు కలసి పోటీ చేస్తే ప్రబావం ఎలా ఉంటుంది, వైసీపీ ఎదుర్కోవాల్సిన విషయలు పై జగన్ ప్రత్యేకంగా నేతలతో మాట్లాడుతున్నారు. వీటన్నింటికీ సంక్షేమ పథకాలే విరుగుడు అని భావిస్తున్నారు. మూడు రాజధానులపై చర్చ జరిగితే అది వైసీపీ మేలు చేస్తుందో..కీడు చేస్తుందో చెప్పడం కష్టం. ఎందుకంటే.. విశాఖలో రాజధాని అంటే… సీమలోనూ సానుకూలత లేదు.