వైసీపీకి .. జగన్ రెడ్డికి అండగా నిలిచే ఓటర్లలో కన్వర్టడ్ క్రిస్టియన్లు ముందు ఉంటారు. జగన్ రెడ్డి కన్వర్టడ్ క్రిస్టియన్ కావడం ఓ కారణం అయితే.. ఆయన కుటుంబంలో అనిల్ కుమార్ ఇంతకు ముందు చర్చిల వారీగా క్రిస్టియన్లను జగన్ రెడ్డి కి ఓటు బ్యాంక్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. మత మార్పిళ్ల ద్వారా అలాంటి వారి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నించారు. అయితే ఇప్పుడు వారి ఓట్లనూ జగన్ రెడ్డికే వేయాలని బతిమాలుకునే పరిస్థితి వచ్చింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి విమలారెడ్డితో ఇప్పుడు రాష్ట్రం మొత్తం పర్యటింప చేస్తున్నారు. పాస్టర్లతో నియోజకవర్గాల వారీగా సమస్యలు పెట్టి .. భోజనం పెట్టి.. గిఫ్టులు ఇచ్చి.. జగన్ రెడ్డికి ఓటేయమని .. క్రిస్టియన్లతో ఓట్లేయించమని బతిమాలుకుంటున్నారు. దీనికి కారణం.. షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోవడమే. ఇప్పుడు క్రిస్టియన్లు కూడా షర్మిల వైపు పోతే ఇక తనకెవరు ఓట్లు వేస్తారన్న ఆందోళనతో.. విమలారెడ్డిని రంగంలోకి దించారు. ఆమె.. తన సొంత సోదరుడు వైఎస్ వివేకా హత్యకు గురైతే.. జరిగిందేదో జరిగిపోయిందని నిందితుల్ని వెనకేసుకు వచ్చిన బాపతు.
విమలారెడ్డి ప్రచారంలో జగన్ రెడ్డి వస్తే క్రైస్తవులకు మంచి జరగుతుదంని చెప్పడమే కాదు.. ఇతర వర్గాలను కూడా కాదని క్రైస్తవులకు మేలు చేస్తారని ఆశ పెడుతున్నారు. ఐదేళ్ల కాలంలో ఎంత మేలు చేశారో చెప్పలేకపోతున్నారు. అయితే విమలారెడ్డి ప్రచారం చేసినా చేయకపోయినా… వారు జగన్ రెడ్డి ఓటర్లు. వారిని కూడా బతిమాలుకోవాల్సిన దుస్థితి… వారు కాంగ్రెస్ వైపు నాలుగైదు శాతం మళ్లినా ఎదురయ్యే పరాభవంపై భయంతో చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పాలన చూసిన తర్వాత మేలు జరుగుతుందో లేదో వారికీ ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది.