వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. భారతీయ జనతాపార్టీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి హార్డ్‌కోర్ సపోర్టర్‌గా మారిపోయారు. కర్ణాటక ఎన్నికలతో ప్రజల్లో ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ ప్రాపకం కోసం.. ఢిల్లీలో విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ చర్చనీయాంశమయ్యాయి. ఏపీలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. మోదీ, బీజేపీని పల్లెత్తు మాట అనుకుండా… చేస్తున్న రాజకీయాలతో ప్రజలకు ఓ క్లారిటీ వచ్చింది. వైసీపీ నేతలకూ ఆ క్లారిటీ ఉంది.
ప్రస్తుతం కోర్టులో ఉన్న సీబీఐ కేసుల్లో విచారణ ఆలస్యమవ్వాలన్నా… తేలిపోవాలన్నా.. మోదీ చల్లని చూపు అవసరం. అందుకే అవసరం లేకున్నా.. వెంటబడి మద్దతు ప్రకటించారు. టీడీపీ కూటమి నుంచి వెళ్లిపోయినా తామున్నామని భరోసా ఇచ్చారు. కానీ .. తెలుగుదేశం పార్టీ బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తే.. ఏ నాటికైనా.. తమకు శశికళ తరహా శిక్ష పడుతుందని భయపడ్డారు. అందుకే ముందుగా టీడీపీని దూరం చేయడంలో.. అన్ని రకాల వ్యూహాలను విజయవంతంగా అమలు చేశారు. మోదీని మంచి చేసుకోవడంలో అన్ని లిమిట్స్ క్రాస్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో వైసీపీ నేతలుతో పాటు జగన్ మీడియా ఇస్తున్న సపోర్ట్… బీజేపీ నేతలను సంతోష పరుస్తోంది. కానీ ఉన్నపళంగా కేసుల కొట్టివేయడం అసాధ్యం. ఆ విషయం వైసీపీ నేతలకూ తెలుసు.
అందుకే వైసీపీ నేతల్లో ఇప్పుడు మళ్లీ దడ ప్రారంభమైంది. మళ్లీ నరేంద్రమోదీ ప్రధాని కాకపోతే పరిస్థితి ఏమిటి..? అన్న ఆలోచనే దానికి కారణం. బీజేపీ గ్రాఫ్ పడిపోతున్న కారణంగానే చంద్రబాబు గుడ్ బై చెప్పాడని గతంలో వైసీపీ నేతలు బహిరంగంగానే చెప్పారు.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై అక్కడి కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని వారి హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కర్ణాటకలో అవసరం లేకపోయినా.. బీజేపీ కోసం జగన్… కాంగ్రెస్‌ను బద్నాం చేస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారు.
ఓ వైపు బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని అంచనా వేసుకుని.. మరో వైపు .. ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్‌తో బద్ధ వైరం తెచ్చుకోవడం ఎందుకన్న భావన వైసీపీలో ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. బీజేపీకి మళ్లీ పూర్తి స్థాయి మెజార్టీ వస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. ఆ పార్టీకి మిత్రపక్షాలు కూడా ఏవీ లేవు. ఒక వేళ మిత్రపక్షాలు బీజేపీకి మద్దతివ్వడానికి రెడీ అయినా ప్రధానమంత్రిగా మోదీని అంగీకరించవు. కాంగ్రెస్‌కు పూర్తి స్థాయి మెజార్టీ రాకపోయినా… ఆ పార్టీతో స్నేహం చేయడానికి.. ప్రాంతీయ పార్టీలు రెడీగా ఉన్నాయి. ఎలా చూసినా… ఇప్పుడున్న ట్రెండ్ కంటిన్యూ అయితే.. ఏడాది తర్వాత .. మోదీ ప్రధానిగా ఉండకపోవచ్చు. అప్పుడు పరిస్థితి ఏమిటని వైసీపీ నేతలు లోలోపల మథన పడుతున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలనుకున్నా…పరిస్థితులు అనుకూలించతకపోతే.. మొత్తానికే మోసం వస్తుందని భయపడుతున్నారు.