వైసీపీ సమన్వయకర్తలు ఖర్చయిపోతున్నారు. కోట్లకు కోట్లు తెచ్చి అటు హైకమాండ్ కు.. ఇటు ఓటర్లకు పంచాల్సి వస్తోంది. తమకు ఇవ్వడంతో పాటు.. పంచాల్సిందేనని వైసీపీ పార్టీ ఆఫీస్ నుంచి రెగ్యులర్ గా ఫాలో అప్ లు వస్తున్నాయి. అంతే కాదు.. ఏ ఏ గిఫ్టులు పంచాలో డిసైడ్ చేసి..లోడ్లు పంపిస్తున్నారు. ఈ దెబ్బకు సమన్వయకర్తలకు చిలుం గట్టిగా వదులుతోంది.
ఏపీలో కొద్ది రోజులుగా అన్ని నియోజకవర్గాలకు కానుకలతో నిండిన లారీలు వెళ్తున్నాయి. అన్ లోడ్ చేసి వస్తున్నాయి. వాటితో పాటు కవర్లలో డబ్బులు పెట్టి పంపిణీ చేస్తున్నాయి. అంతా బహిరంగంగానే జరుగుతోంది. అయితే ఎన్నికల కోడ్ అనేది లేదు కాబట్టి .. ఇంకా అధికార వర్గం చూసీచూడనట్లుగానే ఉంటోంది. నిజానికి ఇలా తాయిలాలు పంచడం చట్ట విరుద్ధమే . విపక్షాలు ఫిర్యాదులు కూడా చేస్తున్నాయి. అయినా పెద్దగా స్పందన ఉండటం లేదు. తాయిలాల పంపిణీ కార్యక్రమం యథేచ్చగా జరిగిపోతోంది. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఉద్యోగుల వరకే వెళ్లింది. వీరిలో ఒక్కొక్కరికి కానుకలు, డబ్బులు కలిపి పది వేల వరకూ ప్రయోజనం లభిస్తోంది.
ఇప్పటికే వైసీపీ అభ్యర్థి ప్రతీ నియోజకవర్గంలో రూ. పాతిక కోట్ల వరకూ ఖర్చు పెట్టి కానుకలు.. నగదు పంపిణీ చేసి ఉంటారని అంచనా. ఇక కోడ్ రాగానే ఎన్నికల ప్రచారం… ఇతర అంశాలకు ఖర్చు పెట్టుకోవాల్సిందే. వైసీపీ నేతల ఖర్చులు చూసి.. వాలంటీర్లకు.. ప్రజలకు అంచనాలు పెరిగిపోతున్నాయి. కనీసం ఒక్క ఓటుకు పదివేలు ఇస్తారని అనుకుంటున్నారు. ఈ అంచనాలను అందుకునేలా వైసీపీ అధినాయకత్వం డబ్బులు రెడీ చేసిందని ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అనుకుంటున్నారు. చివరికి ఏం చేస్తారో మరి !