అక్రమ కేసులు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ. చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమని, ప్రభుత్వంపై పోరాటం ఇంతటితో ఆగేది కాదని, ప్రభుత్వం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని… దీన్ని చూసి ఓర్చుకోలేకే అక్రమ కేసులు పెడుతున్నారని , రాష్ట్ర ప్రజలంతా టీడీపీ వెంటే ఉన్నారని, ఈ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెపుతారని, టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు.
తెలుగు చిత్ర పరిశ్రమని అధికార పార్టీ నేతలు కించపరిచారని, సినీ రంగం నుంచి వెళ్ళిన ఎన్టీఆర్ ఎందరికో రాజకీయ బిక్ష పెట్టారని, అలాంటి వృత్తి, కళాకారులని వైసీపీ ఎమ్మెలేలు అవమానపరిచారని పేర్కొన్నారు.