వైసీపీ ప్రచార వ్యూహం గురించి తెలిసిన ఎవరికైనా… ప్రత్యర్థుల క్యాంపుల్లోకి కార్యకర్తలను పంపి రచ్చ చేయడం .. వాటిని వీడియోలుగా తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారంచేయడం అనే వ్యూహం గురించి క్లారిటీ ఉంటుంది. కడప జిల్లాలో దండెత్తుతున్న షర్మిల దెబ్బకు షాక్ కు గురవుతున్న వైసీపీ నేతలు… తాజాగా.. అలాంటి వీడియోల కోసం మనుషుల్ని రంగంలోకి దింపారు.
తాను షర్మిల ఫ్యాన్ ను అన్నట్లుగా కలరింగిన ఇచ్చిన ఓ యువకుడు షర్మిల యాత్రలో మాట్లాడతానంటూ మైక్ తీసుకున్నాడు. సాక్షి స్క్రిప్ట్ చదివేశాడు. 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డి మాకోసం తిరుగుతున్నాడని.. చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చాడని పాదయాత్ర చేశాడని చెప్పుకొచ్చారు. జగన్ చెబితే చేస్తాడని డైలాగులుకొట్టారో. అంతటితో ఆగదలేదు.. షర్మిలను మీ కుటుంబ సమస్యలేవో మీకు ఉన్నాయని అందుకే ఇక్కడ రాజకీయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
అతని మాట తీరు చూస్తే ఖచ్చితంగా స్క్రిప్ట్ బట్టీ పట్టి వచ్చారని.. అర్థమైపోతుంది. అయినా షర్మిల ఆవేశపడలేదు. మొత్తం చెప్పనిచ్చారు. ఆ తర్వాత తాను ఒక్క మాటే అన్నారు. నువ్వు అభిమానించే వ్యక్తి కోసం నేను 3,200 కిలోమీటర్లు నడిచా.. అలాంటి సొంత చెల్లి బతుకే రోడ్డున పడేశాడు .. ఇక మీరెంత అనడంతో ఆ యువకుడి నోట మాట రాలేదు. అంతకు మించిన స్క్రిప్ట్ ఆ యువకుడికి ఇవ్వలేదు కాబట్టి.. వెళ్లిపోయాడు.
ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా… షర్మిలఇచ్చిన కౌంటర్ ను పక్కన పెట్టేసి ఆ యువకుడి వీడియోను మాత్రం ప్రచారం చేస్తోంది. అంతా ఐ ప్యాకే ఈ వీడియోను ఎడిట్ చేసి.. గ్రూపులకు ఫార్వార్డ్ చేసింది. మొత్తంగా సోదరుడి రాజకీయాన్ని షర్మిల అర్థం చేసుకున్నట్లే కనిపిస్తోందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.