గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా ఉండదు. దానికి సాక్ష్యం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని వాడటం. ఈ అవినీతి కోసం.. ఎంత ఘోరానికి పాల్పడ్డారో స్పష్టంగా కళ్ల ముందే ఉంది.
కర్ణాటకలో నందిని బ్రాండ్ ఆవుపాలు ప్రసిద్ధి. స్వచ్చమైన ఆవుపాలకు నందిని బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. మిగతా డెయిరీలు ఎక్కువగా గేదెపాలుపై దృష్టి పెడతాయి. కానీ కర్ణాటక మిల్క్ కోఆపరేటివ్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ మాత్రం ఆవుపాలకు ప్రసిద్ధి. ఆ సంస్థ దశాబ్దాలుగా ఆవు నెయ్యిని టీటీడీకి సరఫరా చేస్తుంది. అత్యంత క్వాలిటీతో కూడిన నెయ్యి కాబట్టి ధర కూడా కాస్త ఎక్కువే ఉంటుంది. శ్రీవారి లడ్డూ రుచిలో ఈ నెయ్యికి ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంటుంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యిని టెండర్ల ద్వారా సేకరించాలని నిర్ణయించార. ధరను అతి తక్కువగా నిర్ణయించారు. మంచి క్వాలిటీ ఆవు నెయ్యి కేజీ రూ. వెయ్యి వరకూ ఉంటుంది. కానీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్లలో పాల్గొనకూడదనంత తక్కువ ధర నిర్ణయించారు. వారనుకున్నట్లుగా నందిని బ్రాండ్ నెయ్యి లడ్డూకు దూరమయింది. ఆ తర్వాత టెండర్లు పిలిచి అసలు డెయిరీలే లేని ప్రీమియర్ , క్వాలిటీ లాంటి యూపీ కంపెనీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. బీఫ్ ఎక్స్ పోర్టుకు ప్రసిద్ది చెందిన రాయ్ బరేలీలో ఈ కంపెనీలు ఉన్నాయి.
తాము క్వాలిటీ చెక్స్ చేస్తామని చెప్పి తిరుమలలోనే ల్యాబులు పెట్టారు. నాలుగేళ్ల కాలంలో ఓ పది ట్యాంకర్లు క్వాలిటీగా లేవని వెనక్కి పంపారు. అంటే చెక్ చేస్తున్నామని.. మంచి నెయ్యి వస్తుందని చెప్పుకోవడానికి ఇలా చేశారనన్నమాట. వారున్నంత కాలం నిరాటంకంగా ఇది సాగిపోయింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఈవోగా శ్యామలరావును నియమించారు. ఆయన వెంటనే.. లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదంలో క్వాలిటీ ఎందుకు తగ్గిపోయిందో కమిటీ వేశారు. నెయ్యి సహా ఇతర పదార్థాల టెస్టింగ్‌కు దేశంలోని అత్యున్నత ల్యాబ్‌లకు శాంపిల్స్ పంపారు. టెస్టు రిపోర్టులు వచ్చిన వెంటనే.. అంటే జూలైలోనే.. ఆ నెయ్యి సరఫరాదారుల.. నెయ్యిని తీసుకోవడం ఆపేసి బ్లాక్ లిస్టులో పెట్టారు. మళ్లీ నందిని బ్రాండే కొంటున్నారు.
తాజాగా బయటకు వచ్చిన ల్యాబ్ రిపోర్టుల్లో లడ్డూలకు వాడిని నెయ్యి లో అసలు నెయ్యి 19 శాతమే. బీఫ్ కొవ్వు, ఫిష్ ఆయిల్ సహా..ఇతర వ్యర్థాలన్నీ మిగతా మొత్తం ఉన్నాయి. అంటే ఇది అసలు నెయ్యే కాదు.
ఇలా చేసి అడ్డంగా దొరికిపోయారు. ఆ నెయ్యి సరఫరా చేసిన కంపెనీల దగ్గర ఎంత కమిషన్లు కొట్టారో కానీ హిందూ నమ్మకాలపై పెద్ద బాంబు వేశారు. ఇప్పుడు వీరి పాపం పండింది. దొరికిపోయారు.
కొసమెరుపేమిటంటే .. అన్యమతస్తులు ముఖ్యంగా జగన్ రెడ్డి మతం వారు.. హిందూ దేవుళ్ల ప్రసాదాలను పట్టుకోను కూడా పట్టుకోరు. రుచి చూడరు. జగన్ కూడా వాసన చూసినట్లే తప్ప.. తిన్నట్లుగా ఎక్కడా కనిపించలేదు.