ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల రోజుల్లో తీసుకున్న, తీసుకుంటున్న చర్యలు… కక్షపూరితం కాదని.. ఎవర్నీ టార్గెట్ చేయలేదని… ఎవరైనా అడిగినా.. అడగకపోయినా ప్రకటిస్తోంది. మరో వైపు టీడీపీ నేతలు మాత్రం… కక్ష సాధించడానికి మాత్రమే.. ప్రస్తుత సర్కార్ పని చేస్తోందని… విమర్శలు గుప్పిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. ప్రభుత్వం తననే టార్గెట్ చేసుకుందని.. వైసీపీకి తనే అడ్డంలా కనిపిస్తున్నానని… విమర్శలు గుప్పించారు. అధికారప్రతిపక్షాలు కాబట్టి.. అలా విమర్శలు చేసుకుంటూ ఉంటాయి. అయితే.. వైసీపీతో బాగా దగ్గరగా ఉంటూ… టీడీపీని బద్దశత్రువుగా ట్రీట్ చేసి… వైసీపీ గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చేసినా బీజేపీ నేతలకు… మాత్రం… వైసీపీ …కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లుగానే కనిపిస్తోందని అంటోంది. ప్రస్తుతం… ఏపీ సర్కార్… ఒక పార్టీ, కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసినట్టు అనిపిస్తోందని… బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ నేరుగా వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలను కూల్చేముందు ఆలోచించాలని కానీ.. అలాంటిదేమీ చేయకుండానే కూల్చివేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు.. వరుసగా.. టీడీపీ నేతల భవనాలకే నోటీసులు ఇవ్వడం.. కూల్చివేయడం లాంటివి చేస్తూండటంతో.. మాధవ్ ఈ విధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. విశాఖలో గంటా ఇల్లు, మురళీమోహన్ కుటుంబానికి చెందిన ఓ వ్యాపార సంస్థ భవనాన్ని కూలగొట్టారు. అలాగే విశాఖ టీడీపీ ఆఫీసుకు… కూడా కూలగొడతామని నోటీసులు ఇచ్చారు. ఈ పరిణామాలతోనే మాధవ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
ఏపీ బీజేపీలో చేరేందుకు పెద్ద ఎత్తున నేతలు ఆసక్తి చూపిస్తున్నారని.. అందులో.. వైసీపీ నేతలు కూడా ఉన్నారని.. మాధవ్ చెబుతున్నారు. మాధవ్ వ్యాఖ్యలు.. ఇటీవల జరిగిన.. పార్టీ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు గా భావిస్తున్నారు. వైసీపీతో మెతకగా ఉండాల్సిన అసరం లేదని.. బీజేపీ – వైసీపీ ఒకటేనన్న ముద్ర తుడిపేసుకునేందుకు ప్రయత్నించాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే వైసీపీ నిర్ణయాలను బీజేపీ వ్యతిరేకించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.